నాగ చైతన్య మంచోడా?

నాగ చైతన్య ఒక పక్క పెళ్లి పనులతో మరో పక్క కొత్త సినిమాలతో హడావిడిగా వున్నాడు. నాగ చైతన్య తాజా చిత్రం 'యుద్ధం శరణం' గత వారం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుని... పెట్టిన పెట్టుబడి రాబట్టడానికి నానా హైరానా పడుతుంది. మరో పక్క చందు మొండేటి తో చెయ్యబోయే సినిమాని పక్కనబెట్టి మారుతీ దర్శకత్వంలో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసాడు చైతన్య. ఇక దర్శకుడు మారుతీ తాజా చిత్రం 'మహానుభావుడు' కూడా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ దసరా బరిలో పోటీకి సిద్దమయ్యింది. శర్వానంద్ హీరోగా మెహరీన్ హీరోయిన్ గా మారుతీ ఈ చిత్రాన్ని ఒక మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు.
ఇక ఇప్పుడు నాగ చైతన్య తో మారుతి చెయ్యబోయే సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉందని....ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ మీదకెళ్లబోతుందని చెబుతున్నారు. అయితే నాగ చైతన్యతో చెయ్యబోయే సినిమాకి మారుతీ 'మంచోడు' అనే యూత్ ఫుల్ టైటిల్ పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ మధ్య ఏ గ్రేడ్ సినిమాలను పక్కన పెట్టి మారుతీ కుటుంబ కథా చిత్రాలకు, కామెడీ ఎంటర్టైన్మెంట్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. అందుకే ఆయన టైటిల్స్ అన్ని కొంచెం బిన్నంగా.. అంటే 'భలే భలే మగాడివోయ్, బాబు బంగారం, మహానుభావుడు' అంటూ వైవిధ్యంగా ఉంటున్నాయి.
ఇక ఇప్పుడు కూడా నాగ చైతన్య సినిమాకి కాస్త వైవిధ్యంగా 'మంచోడు' అనే టైటిల్ ని సెట్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నితిన్ హీరోయిన్ మేఘ ఆకాష్ పేరును చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది.

