నాకు నిక్ నేమ్ అంటేనే ఇష్టం

ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి నిక్ నేమ్ తోనే చలామణి అవుతున్న హీరో నాని.. అసలు పేరేమిటో తెలుసా..? ఎప్పుడూ నాని నాని అంటూ అతని పేరు ఇండస్ట్రీలోనే కాదు అటు ఫ్యామిలిలో కూడా గట్టిగా పాతుకుపోయింది. అందుకే నాని తన అసలు పేరును పూర్తిగా మరిచిపోయాడు. అసలింతకీ నాని ఒరిజినల్ నేమ్ ఏమిటంటే... నవీన్ బాబు. అయితే నాని మాత్రం నా పేరు నాని..... నన్ను ఇలానే గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. తనను నానిగానే పిలవాలని అంటున్నాడు.
నాని నటించిన తాజా చిత్రం ఎంసీఏ ప్రమోషన్స్ లో భాగంగా మీ అసలు పేరు బాగుంది కదా, మరి ముద్దుపేరును ఎందుకు స్క్రీన్ నేమ్ గా మార్చుకున్నారంటూ ఓ యాంకర్ నానిని సూటిగా అడగగా.. మా అమ్మ, నాన్న, పెద్దమ్మ, అమ్మమ్మ, ఫ్రెండ్స్ ఇలా అంతా నన్ను నాని అనే పిలుస్తారు. అది నా ముద్దు పేరే. దానికి నేను ఒప్పుకుంటాను. కానీ అలా పిలిపించుకోవడమే నాకిష్టం. అందరూ నాని అని పిలుస్తుంటే నాకెంతో హ్యాపీ గా ఉంటుంది. అసలు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా నన్ను నేను నానిగానే పరిచయం చేసుకున్నానని. ఎక్కడా నా అసలు పేరు నవీన్ బాబు అని చెప్పలేదు.
ఇక సినిమా పరిశ్రమలో కూడా నన్నంతా నాని అనే పిలుస్తారు. ఇప్పుడు హీరోని కదా అని అసలు పేరును పెట్టుకోలేదు. అసలు ఎప్పటికీ ఇలా నేను నానిగానే ఉండిపోతానని తన ఒరిజినల్ నేమ్ పై పూర్తిగా క్లారిటీ ఇచ్చేసాడు నాని.

