నరేష్ - సునీల్ కలిసి?

ప్రస్తుతం సినిమాలన్నీ కామెడీ బేస్ మీద తెరకెక్కిస్తేనే కాస్తో కూస్తో సక్సెస్ సాధిస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాల్లో కామెడీ లేకపోయినా యాక్షన్ కమ్ డాన్స్ లు ఉంటే ఆడేస్తాయి. కానీ మీడియం హీరోల సినిమాలైనా, చిన్న హీరోల సినిమాలైనా దానిలో కామెడీ కొరత కనబడితే ఇక అంతే సంగతులు. ఆ సినిమాలో కామెడీ లేకపోతె అవి థియేటర్స్ లోకి వచ్చినా వేస్టే. ఎందుకంటే అలాంటి సినిమాలకు ప్రేక్షకాదరణ ఉండదు. మరి ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లోను కామెడీకి ఎక్కువ స్కోప్ ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు దర్శకులు. మరి సినిమాల్లో కామెడీకి అంత ప్రాధాన్యత ఉంది.
అసలు సునీల్, అల్లరి నరేష్ వీళ్లంతా కామెడీ మీదే హీరోలయ్యారు. అల్లరి నరేష్ సినిమా అంటే కామెడీకి కొరత ఉండదని ఒకప్పుడు ప్రేక్షకులు ఫీల్ అయ్యేవారు. కానీ ఈ మధ్య కాలంలో నరేష్ సినిమాల్లో కామెడీ సరిగ్గా పండడం లేదు. అలాగే సక్సెస్ లు కూడా లేవు. మరో హీరో సునీల్ కూడా కామెడీని నమ్ముకున్నప్పుడు హీరోగా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు యాక్షన్ నమ్ముకుని సీరీయస్ గా హీరోయిజం చేస్తానంటే... దాన్ని తిప్పికొడుతున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు అల్లరి నరేష్, సునీల్ తమ ఫామ్ ని పూర్తిగా కోల్పోయే స్థితిలో ఉన్నారు.
ఇలాంటి టైం లో వీరిద్దరూ జతకట్టి ఒక కామెడీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినబడుతుంది. తొందరలోనే వీరిద్దరు కలిసి తెరపై డబుల్ కామెడీని అందిస్తారట. తమిళ్ రీమేక్ సుడిగాడు సినిమాతో అల్లరి నరేష్ కి బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చిన భీమనేని శ్రీనివాస్ ఈ కామెడీ మల్టి స్టారర్ ని తెరకెక్కించబోతున్నాడట. అయితే ఇప్పుడు తమిళ్ లోని సుడిగాడు కథకి సినిమాకి సీక్వెల్ గా మరో సినిమా రూపొందుతోంది. ఇప్పుడు ఆ సినిమా విడుదల కాకమునుపే దర్శకుడు భీమినేని ఆ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకుని సునీల్, నరేష్ తో ఈ సినిమా చెయ్యాలని ఫిక్స్ అవడమే కాదు... ఈ ఇద్దరి హీరోలను దర్శకుడు సంప్రదించినట్లుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకెళుతుందంటున్నారు.

