నక్షత్రం తారకు ఏడాది పొడవునా సినిమాలే!

గత ఏడాది జాగర్లమూడి రాధా కృష్ణ(క్రిష్) రెండవ ప్రపంచ యుద్ధం నేపద్యాలంలో తెరకెక్కించిన ఒక గ్రామం కథ కంచె. ఎటువంటి వాణిజ్య అంశాల జోలికి పోకుండా కథను కథగానే ప్రెసెంట్ చేసినప్పటికీ ప్రేక్షకాదరణ పొందింది కంచె చిత్రం. ఆ చిత్రంతో బాగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న కథానాయిక ప్రగ్య జైస్వాల్. కంచె కి ముందు కూడా మిర్చిలాంటి కుర్రాడు అనే తెలుగు చిత్రంలో నటించినప్పటికీ ప్రగ్య జైస్వాల్ ప్రేక్షకులలోకి వెళ్ళకలేపోయింది. ఇక కంచె విజయం తరువాత నేటి వరకు ప్రగ్య జైస్వాల్ మరే ఇతర చిత్రం విడుదల కానప్పటికీ రానున్న సంవత్సరంలో ప్రగ్య నటించిన నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి.
ప్రస్తుతం ప్రగ్య జైస్వాల్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి దర్శకత్వంలో నక్షత్రం చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తుండటంతో ప్రగ్య జైస్వాల్ అందాల తారాగానే కాకుండా అభినయం ప్రదర్శించే కథానాయికగా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది అని ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. కృష్ణ వంశి దర్శకత్వంలో నటించిన నటీ నటులు అందరూ వారి గత చిత్రాలకు భిన్నంగా ఆయన చిత్రాలలో అభినయం ప్రదర్శించటం ఈ అంచనాలకు కారణం. నక్షత్రంతో పాటుగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కిస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వెంకటేశాయలోనూ ప్రగ్య జైస్వాల్ నటిస్తుంది. రాఘవేంద్ర రావు, నాగార్జున కలయికలో వస్తున్న భక్తిరస చిత్రం కావటంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. మంచు మనోజ్ తో గుంటూరోడు చిత్రంలో నటిస్తున్న ప్రగ్య జైస్వాల్ కి ఇప్పుడు మరో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలోనూ అవకాశం దక్కింది.
నక్షత్రం, ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం ఇలా వరుసగా 2017 సంవత్సరం పొడుగూతా ప్రేక్షకులను పలకరించబోతుంది ప్రగ్య జైస్వాల్.

