దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ కి ముహూర్తం!!

రామాయణం… ఓ అద్భుత కావ్యం. పురాణాలలో రామాయణం అనేది ఓ అద్భుతం. అయితే ఈ అద్భుత ఘట్టాలన్నీ వెండితెరపై, బుల్లితెరపై దృశ్య కావ్యాలుగా చూపించాలని చాలామంది కలలుకంటుంటారు. ఇప్పటికే ఈ రామాయణం అనేక రకాలుగా అంటే అటు వెండితెర మీద సినిమాలుగా... ఇటు బుల్లితెర మీద సీరియల్స్ గా బోలెడన్ని వచ్చాయి. అంతేకాకుండా రామాయణాన్ని అద్భుత దృశ్య కావ్యంగా తెరకెక్కిస్తామని అన్ని భాషలలోని దర్శకులు నిర్మాతలు అప్పుడప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు.
రూ. 500 కోట్లతో....
దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో తెలుగు.. తమిళ.. హిందీ భాషలలో రూపొందనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అద్భుతంగా తెరకెక్కించేందుకు ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా కలసి ఈ అద్భుత రామాయణ మహా ఘట్టాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ దృశ్య కావ్యం గురించి ఎప్పుడో ప్రకటించిన వారు కొన్ని నెలలుగా సైలెంట్ అయ్యేసరికి ఇక రామాయణం మాట అమర్చిపోయారనుకున్నారంతా.... అయితే తాజాగా జరిగిన ఒక పరిణామం రామాయణ మహాకావ్యం త్వరలోనే పట్టాలెక్కనుంది తెలుస్తుంది. అదేమిటంటే... ప్రస్తుతం లక్నో సిటీలో యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడే ఈ రామాయణం ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం కూడా జరగడం విశేషం. ఉత్తరప్రదేశ్ లో రామాయణాన్ని తెరకెక్కించేందుకు.. యూపీ ప్రభుత్వంతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు.
యూపీ సర్కార్ తో ఒప్పందం....
ఇకపోతే ఈ రామాయణ మహాకావ్యం ఎక్కువ శాతం అయోధ్య నెలవైన ఉత్తర ప్రదేశ్ లోనే అధిక భాగం షూటింగ్ జరుపుకోనుండడంతో.. అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు నిర్మాతలు. మరి 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో మూడు పార్ట్ లుగా ఈ రామాయణ అద్భుత కావ్యం తెరకెక్కనుంది.
- Tags
- రామాయణం

