దెబ్బకి భయపడింది

హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే అనసూయ ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే భయపడుతుంది. ఎందుకంటే అనసూయ మీద నెటిజెన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చెయ్యడంతో అనసూయ ఇలా ట్విట్టర్, పేస్ బుక్, ఇంస్ట్రాగ్రామ్ లకు బాయ్ బాయ్ చెప్పేసింది. ఒకప్పుడు ఎన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేసినా అందరికి ధీటుగా బదులు చెప్పిన అనసూయ ఇప్పుడు మాత్రం నెటిజెన్ల ప్రశ్నలకు జవాబు చెప్పలేక పలాయనం చిత్తగించింది. ఇంతకీ ఆ కథా కమామిషు ఏమిటంటే.... తనతో సెల్ఫీ తీసుకునేందుకు వచ్చిన ఒక కుర్రాడిని తిట్టడమే కాదు ఆ బాలుడి ఫోన్ ని లాక్కుని పగలగొట్టిందని నిన్నటినుండి మీడియాలో ఒకటే హడావిడి.
నిన్న మంగళవారం అనసూయ ఒక పిల్లాడి ఫోన్ పగలగొట్టిందనే ఆరోపణలతో బాగా హైలెట్ అయ్యింది. ఫోన్ పగులగొట్టిన పిల్లాడి తల్లి పోలీస్ లకు కంప్లైంట్ చెయ్యడంతో స్పందించిన పోలీస్ లు.. ట్విట్టర్ లో స్పందిస్తూ... దాన్ని అనసూయకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చెయ్యడంతో.. అనసూయ కామెడీగా తన తప్పేమి లేదని... తనపై ఎవరో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ స్పందించింది. మరి అనసూయ నా తప్పు లేదు ప్రభో అంటున్నప్పటికీ నెటిజెన్ల మాత్రం అంతా అనసూయాదే తప్పన్నట్లుగా ట్వీట్స్ చెయ్యడం, అలాగే హాట్ యాంకర్ అనసూయని బాగా హెట్ చేస్తూ రకరకాల కామెంట్స్ పోస్ట్ చెయ్యడంతో అనసూయ చేసేది లేక ఇలా సోషల్ మీడియా నుండి తప్పుకోవడం అందరికి అమితాశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఏ విషయాన్ని అయినా గట్టిగా వాదిస్తూ నిలబడే అనసూయ ఇలా ఒక సమస్య వలన సోషల్ మీడియాని వదిలెయ్యడంతో... ఈ విషయంలో అంటే ఆ పిల్లాడి ఫోన్ పగులగొట్టిన విషయంలో అంతా అనసూయాదే తప్పన్నట్టుగా జనాలు ఫిక్స్ అవుతున్నారు.

