దూకుడుమీదున్న హీరో

తెలుగు పరిశ్రమలోకి షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఖాతాలోకి ఇప్పుడు మరో సినిమా వచ్చి చేరింది. ప్రస్తుతం లేడీ డైరెక్టర్ అయిన సంజనా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజుగాడు' సినిమాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో 'రంగులరాట్నం' సినిమా చేస్తున్న రాజ్ తరుణ్ ఇప్పుడు సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.
రాజ్ తరుణ్ డిసెంబర్ నుంచి మరో సినిమాతో బిజీ కానున్నాడు. 'అలా ఎలా' ఫేం అనిష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'లవర్' అనే సినిమాని డిసెంబర్ 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఎప్పుడో జరుపుకున్నప్పటికీ.. రాజ్ తరుణ్ కున్న ప్రస్తుత కమిట్మెంట్స్ వలన సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో రాజ్ తరుణ్ మరో హిట్ అందుకోవడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు.
ఇకపోతే ఈ సినిమా మొత్తం ప్రేమకథల్లో సరికొత్త కోణాన్ని టచ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో రూపొందనుంది అని తెలుస్తుంది. ఈ సినిమా లో రాజ్ తరుణ్ సరసన గీతా సురేష్ హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చివరి దశలో ఉన్న ఈ సినిమా ని దిల్ రాజు పక్కా ప్లాన్ తో నిర్మించి వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలి అని భావిస్తున్నాడు.

