దీని కంతటికి కారణం చిరు నే నట

సైరా.. నరసింహారెడ్డి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి చాలానే రుమౌర్స్ వస్తున్నాయి. వాటన్నిటినీ సైరా టీం ఖండించింది. సైరా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయి రెండు నెలలు కావొస్తుంది. రెండో షెడ్యూల్ ఈనెల రెండో వారం నుండి స్టార్ట్ అవ్వాలి కానీ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు.
అయితే రెండో షెడ్యూల్ లేట్ అవ్వడానికి కారణం చిరంజీవినే అంట. నిజానికి ఈ మంగళవారమే చిరంజీవితో సహా మొత్తం సైరా యూనిట్ అంతా కేరళకు షిఫ్ట్ అవాల్సి ఉంది. కానీ అది జరగలేదు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే...
రత్నవేలు సైరాకి..రంగస్థలంకి రెండిటికి అతడే సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతం రంగస్థలం మూవీకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాల్సి ఉంది. మార్చి 30న విడుదల ఫిక్స్ చేసారు. దీనికి రత్నవేలు ప్రెజెన్స్ తప్పనిసరి. అందుకే రామ్ చరణ్ సినిమా పనులను పూర్తి చేసిన తర్వాతే సైరా షూటింగ్ కు రావాల్సిందిగా సూచించారట మెగాస్టార్. అందుకే రత్నవేలు ప్రస్తుతం ఆ పనుల్లో వున్నాడు. అందుకే సైరా షూటింగ్ మార్చ్ 3వ వారానికి వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

