దిల్ రాజు మాస్టర్ మైండ్ ప్లాన్!

టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు కి ఈ ఏడాది 2017 లో పట్టిందల్లా బంగారమే అవుతుంది. వరసగా ఐదు సినిమాలు హిట్ అందుకుని ఆరో సినిమా ఎంసీఏ తో మరో హిట్ అందుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. నాని - సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే నిర్మాత దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్ కొడతాడు.
అయితే దిల్ రాజు ఈ మధ్యన ఫిదా సినిమా దగ్గర నుంచి తెలంగాణపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్లుగా కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ లోని నిజామాబాద్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫిదా సినిమా తీశారు. అంతేకాకూండా అక్కడ ప్రమోషన్ నిర్వహించి ఆయన సొంత జిల్లా మనషులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోమారు వరంగల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంసీఏ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో నాని వదిన భూమికకు వరంగల్ ట్రాన్స్ఫర్ అవడం... అక్కడ కొన్నాళ్లపాటు ఉండడం వంటి షూటింగ్ వరంగల్ లోనే జరిగింది. దీంతో దిల్ రాజు వరంగల్‌లో ఇప్పుడు తన మార్క్ చూపిస్తూ ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేశారు.
దీంతో తెలంగాణలో ఏదో ఒక ప్లేస్ పెట్టి సినిమా తీయడం దిల్‌రాజుకు సెంటిమెంట్‌గా మారింది అనే టాక్ వినబడుతుంది. అయితే తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమా తెరకెక్కిస్తే ఇక్కడ సెంటిమెంట్ రగలించడంతో పాటు వ్యాపారం పెరుగుతుంది. మరి దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా.... నిర్మాతగా లాభం చేకూరుతుంది. ఇది దిల్ రాజు మాస్టర్ మైండ్ ప్లాన్.

