దిల్ రాజు చెప్పినా ఆ హీరో వినడం లేదా?

దిల్ రాజు టాలీవుడ్ లో ఎంత సక్సెస్ ఫుల్ నిర్మాతో తెలిసిందే. తాను సినిమాను నిర్మించకపోయినా.. వేరే నిర్మాతల సినిమా తనకు నచ్చితే గనక ఆ సినిమాని తానే హోల్సేల్ గా కొనేసి ఓన్ గా విడుదల చేసుకునే కెపాసిటీ గల వ్యక్తి. నిర్మాతగా వరుస విజయలమీదున్న దిల్ రాజు తాజాగా సక్సెస్ ఫుల్ హీరో నాని హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణార్జున యుద్ధం సినిమాని సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మించినప్పటికీ.. ఆ సినిమాని దిల్ రాజు కొనేసాడు. ఈ చిత్రంలో నాని డ్యూయెల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. నాని గత సినిమాల విజయం తో ఇప్పుడు రాబోయే కృష్ణార్జున యుద్ధంపై భారీ అంచనాలున్నాయి.
అయితే ఈ చిత్రాన్ని నిర్మాతలు, మరియు హీరో అయిన నాని ఏప్రిల్ 12 విడుదల చెయ్యాలని డిసైడ్ అవడమే కాదు... అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే కృష్ణార్జున యుద్ధం సినిమాని మొత్తం దిల్ రాజు కొనేసి విడుదల చేస్తున్నాడు. అయితే ఇప్పుడు దిల్ రాజు ఈ చిత్ర విడుదల తేదీ విషయంలో అభ్యంతరం వ్యక్తపరుస్తున్నాడట. ఎందుకంటే ఏప్రిల్ 20 న మహేష్ భరత్ అనే సినిమా విడుదలవుతుంది. మరి కృష్ణార్జున యుద్ధం చిత్రానికి భరత్ అనే నేను చిత్రం విడుదల టైం కి పెద్దగా గ్యాప్ లేదు. అయితే కృష్ణార్జున చిత్రం హిట్ అయినా అవకపోయినా... భరత్ అనే నేను హిట్ టాక్ తెచ్చుకుంటే.. ఆ ప్రభావం ఈ కృష్ణార్జున యుద్ధం సినిమాపై పడుతుందనేది దిల్ రాజు ఆందోళన.
అందుకే కృష్ణార్జున యుద్దాన్ని మే 18వ తేదీన విడుదల చేయాలనేది దిల్ రాజు ఆలోచనట. కానీ నాని మాత్రం ఏం పర్లేదు కృష్ణార్జునని ఏప్రిల్ 12న రిలీజ్ చేసేయవచ్చని చెబుతున్నాడట. మరి దిల్ రాజు ఎంతో ఆలోచించిగాని కొన్ని నిర్ణయాలు తీసుకోడు. కానీ నానికున్న కాన్ఫిడెన్స్ వలన కృష్ణార్జున యుద్ధం చిత్రాన్ని ఏప్రిల్ 12 కె విడుదల చేసేద్దామని దిల్ రాజుతో చెబుతున్నాడన్నమాట.

