దిల్ రాజు కి నో చెప్పడమా?

తొలి చిత్రం ‘ఫిదా’తోనే ప్రేక్షకుల్ని ఫిదా చేసేసిన సాయి పల్లవి తన తదుపరి చిత్రం దిల్ రాజు సంస్థలో నుండి వస్తున్న ‘ఎమ్.సి.ఏ’ చేస్తుంది. ఈ చిత్రం తరువాత ఆమె నటించిన ద్విభాషా చిత్రం ‘కణం’ విడుదల కానుంది. ఆ తరువాత సాయి పల్లవి నటించే చిత్రం గురించి వివరాలేమీ తెలియదు. కానీ తాజాగా ఆమె నటించే చిత్రం పై వార్తలొస్తున్నాయి. మొన్నామధ్యన దిల్ రాజు కి నో చెప్పిన సాయి పల్లవి అనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ హీరోగా సతీష్ వేగస్నా దర్శకత్వంలో తెరకెక్కనున్న 'శ్రీనివాస కళ్యాణం' లో తన పాత్రకి ప్రాముఖ్యత లేదని సాయి పల్లవి దిల్ రాజుకి నో చెప్పినట్లుగా వార్తలొచ్చాయి.
మల్టీస్టారర్ లో...
అయితే ఇప్పుడు తాజాగా ఆమె తన తదుపరి చిత్రం సైతం దిల్ రాజు సంస్థలోనే కమిట్ అయ్యిందనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ‘డీజే’ చిత్రంతో దిల్ రాజుకు ఘన విజయాన్ని అందించిన హరీష్ శంకర్ తన తదుపరి చిత్రం కూడా దిల్ రాజు బ్యానర్ లోనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ చిత్రంలో శర్వానంద్ , నితిన్ నటించనున్నారని తెలిసింది. ఆ చిత్రంలో కథానాయిక పాత్రకు సాయి పల్లవిని సంప్రదించారట. అందుకు ఆమె సమ్మతం తెలిపినట్టు తెలిసింది. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో కూడా సాయి పల్లవి నటిస్తే.. తెలుగులో ఆమె దిల్ రాజు బ్యానేర్ లోనే మూడు చిత్రాలు చేసినట్లవుతుంది. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ లోనే ఆమె మూడు సినిమాలకు 'ఫిదా' టైం లోనే కమిట్ అయిన విషయం తెలిసిందే.
- Tags
- సాయి పల్లవి

