దసరాకి రాకపోయినా.. అప్పుడు పక్కా!!

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కలయికలో ఆవస్తున్న PSPK 25 వ చిత్రం సందడి ఈ దసరాకే షురూ అవుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు భావించడమే కాదు... కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ దసరాకి పవన్ కళ్యాణ్ హడావిడి ఉండదని తెలిసిపోవడంతో పవన్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ లుక్ కోసం, సినిమా టైటిల్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న ఫాన్స్ ని ఈ దసరా రోజున ఉసూరమనిపించింది చిత్ర బృందం. అయితే ఈ దసరాకి రాకపోయినా వచ్చే దీపావళికి మాత్రం పవన్ టైటిల్ లోగో, పవన్ లుక్ ఖచ్చితమంటూ వార్తలొస్తున్నాయి.
టైటిల్ ఇదేనా?
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున కాన్సెప్ట్ పోస్టర్ అంటూ కొత్తగా ట్రై చేసిన చిత్ర బృందం ఆ తర్వాత వెంటనే సంగీత దర్శకుడు ఆలపించిన ఒక మ్యూజిక్ బిట్ ని వదిలారు. అలాగే సాయంత్రానికి కీర్తి తో పవన్ రొమాన్స్ చేసే స్టిల్ వదిలి ఫాన్స్ ని సర్ ప్రైజ్ అయితే చేశారు గాని సినిమాకి టైటిల్ ని మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఇక పవన్ కొత్త సినిమా టైటిల్ అజ్ఞాతవాసి అంటూ ఒక టైటిల్ హల్చల్ చేస్తుంది. కానీ చిత్ర బృందం మాత్రం దాన్ని కన్ ఫర్మ్ చెయ్యకుండా సస్పెన్స్ లో పెట్టేసింది. ఈ దసరాకి పవన్ కళ్యాణ్ టీజర్ గాని.. అలాగే టైటిల్ గాని రాకపోవడానికి కారణం షూటింగ్ ఇంకా చాలా మిగిలిపోవడంతోనే లాస్ట్ మినిట్ లో ఈ దసరా కి రావాల్సిన వాటిని క్యాన్సిల్ చేసినట్లుగా తెలుస్తుంది.
దీపావళికేనా?
అందుకే దీపావళికి ఇంకా 20 రోజులు టైం ఉండడంతో ఈలోపు కొన్ని పనులు పూర్త్తి చేసుకుని ఫ్రెష్ గా దీపావళి పండగ నాటికీ పవన్ 25 వ చిత్ర టీజర్ ని విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొన్నటివరకు ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న చిత్ర బృందం ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి మరోసారి విదేశాలకు ప్రయాణం కాబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇకపోతే పవన్ కి జోడిగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుండగా... అను ఇమ్మాన్యువల్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.

