దమ్ము కొట్టింది నేనే అంటున్న హీరోయిన్!!

గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో హీరోయిన్ అమల పాల్ సిగరెట్ తాగుతున్న పిక్స్ వైరల్ గా మారాయి. ఒక తమిళ సినిమాకి సంబందించిన ఫొటోస్ లో అమలాపాల్ దమ్ము కొడుతూ కనబడుతుంది. సిగరెట్ తాగుతూ రింగు రింగులుగా పొగ వదులుతూ మరీ జనాలకి మతులు పోగొడుతుంది. ఇక అమల నోటితో సిగరెట్ కాల్చుతూ ముక్కుతో పొగ వదులుతూ కనబడుతుంది. అయితే అమల పాల్ నిజంగా దమ్ముకొట్టలేదని... అవన్నీ సినిమా కోసమే గ్రాఫిక్స్ గట్రా ఉపయోగించి తీశారని.... కాదు కాదు బాడీ డబుల్ ద్వారా ఆ సిగరెట్ సన్నివేశం తెరకెక్కించారని అంటున్నారు.
డూప్ పెడదామన్నా....
అయితే తాను దమ్ముకొట్టలేదని వస్తున్న వార్తలపై అమల పాల్ స్పందించింది. ఒక తమిళ సినిమా కోసం తాను సిగరెట్ తాగానని.... ఆ సినిమాలో ఒక సన్నివేశంలో సిగరెట్ తాగాల్సి వస్తుంది అని..... అందుకే సిగరెట్ తాగడానికి ఒప్పుకున్నాని తెలిపింది. ఇక దర్శక నిర్మాతలైతే ఈ సిగరెట్ తాగే సన్నివేశాన్ని ఒక డూప్ పెట్టి కానిచ్చేద్దామన్నారట. కానీ ఆ సీన్ సహజంగా పండాలి అంటే నేనె ఆ సిగరెట్ తాగాలని.... ఈ సన్నివేశంలో డూప్ వద్దు నేనె చేస్తానని అమల చెప్పడంతో అమలతోనే ఆ సెగరెట్ తాగే సీన్ ని తెరకెక్కించారట. మరి ఆ సీన్ లో ఎంతో సహజంగా నటించానని చెబుతున్న అమల ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదకరం అంటూ మెస్సేజ్ కూడా ఇస్తుంది.
- Tags
- అమలాపాల్

