దగ్గుబాటి ఫామిలీ నుండి ఇంకో హీరో!

సినీ పరిశ్రమలో ఏ హీరో అయిన బాగా క్లిక్ అయితే..తన వెంటే సినీ పరిశ్రమలోకి వచ్చేస్తారు వారసులుకాని... బంధువులుకాని. ఈ ప్రభావం ఇతర పరిశ్రమలో ఉందొ లేదో తెలీదు కానీ మన టాలీవుడ్ పరిశ్రమలో బాగా వుంది.
వారసత్వంగా ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి ఫ్యామీలనుండి ఎంత మంది వచ్చారో మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే కోవలో దగ్గుబాటి ఫామిలీ నుండి కూడా ఒక వారసుడు రాబోతున్నాడు.
'లీడర్', 'నేను నా రాక్షసి', 'బాహుబలి', 'ఘాజి', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రతేక్య గుర్తింపు తెచ్చుకున్నాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు చిత్ర పరిశ్రమలోకి ఆయన సోదరుడు అభిరామ్ దగ్గుబాటి రాబోతున్నాడు. 2018లో అభిరామ్ ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈచిత్రానికి ప్రముఖ దర్శకుడు భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రానా '1945 ' అనే చిత్రంతో నటిస్తున్నాడు.

