థాయిలాండ్‌లోని బ్యూటీ తిరిగొస్తే పవన్ జోడీ తేలుతుంది

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాల చిత్రీకరణతో పాటు సమాంతరంగా రాష్ట్ర రాజకీయాలకు అనుగుణంగా జనసేన పార్టీ ని బలపరిచే కార్యక్రమాల్లో తలమునకలై వున్నారు. అయితే దీని వలన జరుగుతున్న తన చిత్ర నిర్మాతలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే శరత్ మరార్ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల తరువాత కాటమరాయుడు చిత్రాన్ని పట్టాలెక్కించి క్రమం లో పలుమార్లు దర్శకుల మార్పు జరగటంతో తన విలువైన సమయాన్ని, సొమ్ము ని అధికంగా ఖర్చు చేసి ఇబ్బంది పడ్డారు. అందుకే చిత్రీకరణ ప్రారంభం ఐన నాటి నుంచి పవర్ స్టార్ కాటమరాయుడి చిత్రీకరణ సజావుగా సాగే విధంగా తన జనసేన కార్యక్రమాల ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అంట.
ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న కాటమరాయుడు తో పాటు తన తదుపరి చిత్రాలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రం, తమిళ దర్శకుడు నీసన్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రెండు చిత్రాలకు సంబంధించి కథానాయికల ఎంపిక జరుగుతుంది. నీసన్ దర్శకత్వంలో చెయ్యబోయే వేదలమ్ రీమేక్ కోసం ఆ చిత్ర బృందం రకుల్ ప్రీత్ సింగ్ పై మక్కువ చూపుతుండగా, పవర్ స్టార్ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించారు అని తెలుస్తుంది. ప్రస్తుతం థాయిలాండ్‌లో ధ్రువ సాంగ్ షూట్లో వున్న రకుల్ ఇండియా తిరిగి రాగానే కథానాయిక విషయం ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుత పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయుడు లో తనతో గబ్బర్ సింగ్ లో కలిసి నటించిన శృతి హాసన్ మరో సారి ఆ అవకాశం దక్కించుకుంది.

