Fri Dec 26 2025 00:44:39 GMT+0000 (Coordinated Universal Time)
త్రిష వ్యాపారంలో ఫాదర్ సెంటిమెంటు!

కాజల్ అగర్వాల్, తాప్సి పన్ను, రకుల్ ప్రీత్ సింగ్ వంటి నేటి తరం కథానాయికలు అంతా కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే మరోపక్క వివిధ వ్యాపారాలలో రాణిస్తున్నారు. అయితే నటిగా వీరందరి కంటే త్రిష సీనియర్. కానీ వ్యాపార రంగంలోకి మాత్రం వీరందరి తరువాత వస్తుంది. నట జీవితం ప్రారంభించిన దశాబ్దన్నర కాలం తరువాత కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీ గా వున్న నటి త్రిష. అయితే త్రిష ఇప్పుడు తన సమకాలీన నటీమణుల దారి లో నడవబోతుంది.
బెంగుళూరు పట్టణంలో స్టార్ హోటల్ ప్రారంభించే పనిలో వుందిట త్రిష. 60 సౌకర్యమైన సూట్ రూమ్స్ మరియు ఇతర స్థాయి గదులతో స్టార్ హోటల్ ను సిద్ధం చేస్తుంది. త్రిష స్టార్ హోటల్స్ నే వ్యాపారంగా ఎంచుకోవటానికి ఒక బలమైన కారణం కూడా వుంది. త్రిష తండ్రి ఒకప్పుడు స్టార్ హోటల్ లో పని చేసేవారు. అక్కడ పని చేస్తూ ఎప్పటికైనా తనకంటూ ఒక సొంత స్టార్ హోటల్ వుండాలని ఆశపడేవారు. కానీ ఆ ఆశ నెరవేరకుండానే ఆయన మరణించారుట. అందుకని త్రిష వ్యాపార రంగంలోకి స్టార్ హోటల్ స్థాపించి అడుగుపెట్టబోతుంది.
బెంగుళూరు నగరంలో ఇంత విలాసవంతమైన స్టార్ హోటల్ కి పెట్టుబడి భారీ మొత్తంలోనే కావాల్సి ఉంటుంది. మరి ఈ స్టార్ హోటల్ కి త్రిష ఒక్కతే అధిపతో లేక వ్యాపార భాగస్వాములతో కలిసి నిర్మిస్తుందో తెలియాల్సి వుంది.
Next Story

