త్రిష @ త్రీ మిలియన్స్

ప్రస్తుతం నడుస్తున్న సీజన్ లో ‘త్రీ మిలియన్స్’ లేదా ‘30 లక్షలు’ వంటి పదాలు వినిపిస్తే అది కాస్తా త్రిష వద్ద ఉన్న బ్లాక్ మనీ ఏమో అని అందరూ అనుకునే ప్రమాదం ఉంది. మిలియన్స్ లో లెక్క చెబితే.. డాలర్లలో ఆమె దాచి ఉంచిందేమో అని కూడా ఎవరైనా అనుకోవచ్చు. కానీ.. ఈ కబురు అలాంటి నల్లసంపద గురించినది కాదు. నిజానికి సినీ తారలకు ఫ్యాన్స్ కంటె మించిన సంపద ఏదీ ఉండదు. ఆ కోణంలోంచి చూస్తే త్రీ మిలియన్స్ త్రిషకు ఉన్న అభిమానుల సంపదను తెలియజెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో నవతరం తారలంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గానే ఉంటున్నారు. కొందరు వేరొకరి ద్వారా అకౌంట్ నడుపుతూ ఉండేవారయితే.. స్వయంగా నిత్యం ఏదో ఒక పోస్టులు పెడుతూ.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే వారు మరికొందరు. అలాంటి హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. ఆమె ట్విటర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు.
తాజా ఖబర్ ఏంటంటే.. ట్విటర్ లో త్రిషను ఫాలో అవుతున్న ఫ్యాన్స్ సంఖ్య త్రీ మిలియన్స్ దాటిందిట. అంటే 30 లక్షల మంది ఫాలో అవుతున్నారన్నమాట. ఎవరినైనా ఇది సంతోషపెట్టే అంశమే. అందుకే త్రిష కూడా.. ఈ మైలురాయి చూసుకుని మురిసిపోయి, ఇంతగా తనను సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్, ఫాలోయర్స్ అందరికీ థాంక్స్ మెసేజిని ట్విటర్ ద్వారానే పంచుకుంది.

