తొందరగానే సర్దుకుంటుంది

'అందాల రాక్షసి' తో తెలుగు ప్రజలకి దగ్గరైంది 'లావణ్య త్రిపాఠి'. చేసింది తక్కువ సినిమాలే అయిన మంచి పేరు అయితే తెచుకోలేకపోయింది. ప్రతి సినిమాకి తనకున్న ఫేమ్ పోగొట్టుకుంటూ వచ్చింది. కానీ 'మిస్టర్' దగ్గరకు వచ్చేసరికి లావణ్య ఏంటిలా వుంది అనుకున్నారు ప్రేక్షకులు. ఇక లేటెస్ట్ గావచ్చిన 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా లో తన పేస్ ఎక్సప్రెషన్ తో జనాలకి చిరాకు తెప్పించింది. ఈ సినిమాతో ఇక లావణ్య త్రిపాఠీ ఇన్నింగ్స్ ముగిసిపోయినట్లే అనుకుంటున్నారు.
'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలో అనుపమ చేసిన సెటిల్ యాక్షన్ ముందు లావణ్య తేలిపోయినట్టు కనిపించింది. దానికితోడు ముదిరిపోయినట్లున్న లావణ్య ఫేస్, దానికి భయంకరమైన మేకప్, ఆ డ్రెస్ సెన్స్.. అబ్బో.. జనాలు గొల్లు మంటున్నారు ఆమెను చూసి. అనుపమ పెర్ఫార్మెన్స్ ముందు, ఆమె ఎక్స్ ప్రషన్స్ ముందు, అనుపమ క్యారెక్టర్ ముందు లావణ్య అన్ని విధాలా తేలిపోయింది. సినిమాలో వచ్చే మందు కొట్టే సీన్ అయితే ప్రేక్షకులకి చిరాకు అనిపించాయి. దానికి తోడు కొన్ని చోట్ల ఓవర్ మేకప్ తో కనిపించటం..... ఇలా చాలా అంశాలే వున్నాయి చెప్పుకోటానికి.
'సోగ్గాడే చిన్నినాయనా'..... సినిమాతో టాలీవుడ్ లో స్థిరపడదామనుకున్న ఏ ఈభామకు ఆతర్వాత వచ్చిన సినిమాల్ని వరసబెట్టి ప్లాప్స్ అవడంతో ప్రేక్షకులు కూడా ఈమెపై పూర్తి వ్యతిరేఖత చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక లావణ్య త్రిపాఠీ స్టార్ హీరో సినిమాలకు పనికిరాదేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒకేసారి అడుగుపెట్టినా, మిగిలిన యంగ్ హీరోయిన్ల కన్నా త్వరగా ఫేడవుట్ అవుతోంది ఈ భామ.

