తెలుగులో రజని మార్కెట్ సగంపైగా పడిపోయింది!!

రజిని కాంత్ సినిమా అంటే కోలీవుడ్ లోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ వుంది. అందుకే అతని సినిమా కోట్లు పలికినా కొనేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ కి రజిని సినిమా అంటే అంత కాన్ఫిడెన్స్ మరి. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయినా సినిమాకు పైసలు గ్యారెంటీ. డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ. కానీ ఈసారి సూపర్ స్టార్ సినిమా 'కాలా'కి తెలుగులో మార్కెట్ సగానికి పైగా పడిపోయింది.
ఇప్పుడు సిద్ధంగా లేరా?
రజిని లాస్ట్ మూవీ కబాలికు తెలుగులో మంచి రేటు పలికింది. ఏపీ, నైజాం కలిపి దాదాపు 33 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. గతంలో రజిని ఫ్లాప్స్ ఉన్నపటికీ కబాలి సినిమాకి మంచి రేటు వచ్చింది. సినిమా పోయి కొంత లాస్ కూడా వచ్చింది. అయితే ఈసారి మాత్రం రజిని పై అంత పెట్టుబడి పెట్టడానికి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు.
పన్నెండు కోట్లకేనా?
అందుకే 'కాలా' సినిమా తెలుగు రైట్స్ ఎన్వీ ప్రసాద్, మరో నిర్మాతతో కలిసి జస్ట్ 12 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. కబాలి 33 కోట్లకు అమ్ముడైతే..ఈ సినిమా మాత్రం దాంట్లో సగం కన్నా ఇంకా తక్కువ రేట్ కే అమ్ముడైంది. కబాలి ప్రభావం రజిని పై బాగా పడినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కు పంట పండినట్టే.
- Tags
- రజనీ కాలా

