తెలుగు సినిమా నిర్మాణంలోకి గాలి

గాలి కూతురు పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి కార్డుతోనే సంచలనాలకు తెర లేపిన గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం ఇప్పుడు ఏం చేసినా సంచలనమే. ఆ మధ్యన ఐటి దాడులకు భయపడి కొంచెం వెనక్కి తగ్గారని వినిపించినా కూడా గాలి చేసే పెళ్లి ఏర్పాట్లలో ఏ విధమైన లోటు లేకుండా కానిచ్చేస్తున్నాడు. ఇక పెళ్ళికి పిలవాల్సిన వివిఐపి లు దగ్గర నుండి టాలీవుడ్ లో పెద్దలను కూడా పిలిచినట్లు వార్తలొచ్చాయి. రాజకీయనేతలనుండి.... సినిమా నటుల వరకు గాలి ప్రత్యేకం గా ఆహ్వానించినట్లు సమాచారం. ఇక ఈ పెళ్ళికి 6000 మంది వివిఐపిలు, విఐపి లు హాజరవుతారని ఒక అంచనా వేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో గాలికి మంచి ఫ్రెండ్ వున్నాడు. ఆయనే డైలాగ్ కింగ్ సాయి కుమార్.
ఇప్పుడు గాలి జనార్దన్, సాయి కుమార్ సహాయం తోనే పెళ్లి కార్డుని వేయించడం దగ్గరనుండి ఈ పెళ్ళికి అథితులని ఆహ్వానించడం వరకు, ఇంకా ఈ పెళ్లిని అంగరంగ వైభవం గా చెయ్యడానికి అన్ని విధాలా సాయి కుమార్ హ్యాండ్ ఉందనే న్యూస్ ఎప్పుడో బయటికి వచ్చింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖుల పిలుపులు కూడా సాయి కుమార్ స్వయం గా చేపట్టాడని అంటున్నారు. అంతేకాకుండా గాలి టాలీవుడ్ పెద్దలకి ఒక స్పెషల్ పార్టీని ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ పార్టీని అదిరిపోయే రేంజ్ లో ఇవ్వాలని గాలి జనార్ధన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గాలి వారింట్లో జరిగే సంగీత్ కార్యక్రమానికి తారలు కూడా ఆడిపాడుతారని తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే గాలి జనార్దన్ రెడ్డి మాత్రం టాలీవుడ్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం అతను త్వరలోనే సినిమా నిర్మాణ రంగం లో కాలు పెడుతున్నాడని..... దాని కోసమే ఈ పెళ్లివేడుకని ఉపయోగించుకోవాలని గాలి చూస్తున్నాడని ప్రచారమూ మొదలైంది

