తెలుగు కెరీర్ అగమ్యగోచరమే!!

'హ్యాపీ డేస్' తో హ్యాపీగా టాలీవుడ్ లో సెటిలైపోయిన తమన్నా అప్పటినుండి నిన్నమొన్నటి 'బాహుబలి ద బిగినింగ్' వరకు టాలీవుడ్ లో మంచి పొజిషన్లోనే కొనసాగింది. కానీ ఈ మధ్య అమ్మడుకి టాలీవుడ్ అవకాశాలు పూర్తిగా దూరమైపోయాయి. తెలుగు, తమిళ అగ్ర హీరోలతో నటించిన తమన్నా తన అందాల ఆరబోతతో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటూ రెండు భాషల్లో చక్రం తిప్పింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి టాలీవుడ్ లో అవకాశాలు లేక వెలవెలబోయే పరిస్థితుల్లో పడిపోయింది ఈ మిల్కి బ్యూటీ.
ఆమె నటించిన తెలుగు సినిమాలు చాలావరకు వరసబెట్టి ప్లాపులవడంతో తమన్నా టాలీవుడ్ కెరీర్ కష్టాల్లో పడింది. ఇక బాహుబలి వంటి సినిమా ఆ చిత్రంలో నటించిన నటీనటులందరికి గొప్ప పేరు ప్రఖ్యాతలతో పాటే అవకాశాలు అందిపుచ్చుకుంటూ బిజీకాగా ఒక్క తమన్నా మాత్రమే ఇలా అవకాశాలు లేక ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం తమిళంలో కాస్త బిజీగా వున్న తమన్నా హిందీలో కూడా రెండు చిత్రాల్లో నటిస్తుంది. కానీ టాలీవుడ్ లో తమన్నా నటించిన చిత్రం ఒక్కటిలేదు సరికదా కనీసం చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేకపోయేసరికి ఇక తెలుగులో తమన్నాకి అవకాశం రాదనే గుసగుసలు బాగా వినబడుతున్నాయి.

