తాగి రచ్చ చేసిన సంగతి చెబుతుంది

బాలీవుడ్ హీరోయిన్ తాగిన మత్తులో దొరికొన్నాళ్ళకి దొరికినట్టు ముద్దులు పెట్టేసిన సంగతి ఆమె స్వయంగా చెప్పి సంచలనం అయ్యింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ భామ పరిణీతి చోప్రా. మొట్టమొదటిసారి పీకల దాకా తాగిన మత్తులో తనేం పనులు చేసిందో తనకి అసలు తెలియదట. అలా పీకలదాకా తగిన మత్తులో ఒక హోటల్ లోని కనిపించిన సిబ్బందికి కనిపించినట్టు ముద్దులు పెట్టేసిందట. ఆ విషయంగురించి ప్రస్తావిస్తూ తనకి జరిగిన మందు అనుభవాన్ని నో ఫిల్టర్ నేహా కార్యక్రమం లో చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ నేహా దుపియా నిర్వహిస్తున్న నో ఫిల్టర్ నేహా కార్యక్రమంలో కి ఎవరొచ్చినా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అందుకు సిద్దపడే ఈ షోలో భాగం కావలి. అలా నిజాలు చెప్పడానికి పూర్తిగా ప్రిపేర్ అయ్యి వస్తే నే ఆ షోలో అడుగు పెట్టాలి. ఇక ఆ షోకి వచ్చిన పరిణీతి చోప్రా ఇలా నిజాలు చెప్పడానికి సిద్దపడే తన మందు మొదటి అనుభవాన్ని చెప్పేసింది. ఆ మొదటి మందు అనుభవం మీరూ తెలుసుకోండి.
ఒక రోజు ఒక హోటల్ లో పెద్ద పార్టీ జరిగింది. ఆ పార్టీ అయ్యేసరికి రాత్రి 12 అవడంతో పార్టీకి వచ్చిన గెస్ట్ లు అందరూ వెళ్లిపోయారు. ఇక అక్కడ నేను, అలియాభట్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్ మాత్రం మిగిలాం. అయితే వారంతా నన్ను తాగమని బలవంతం చేశారు. కానీ నాకు అలవాటు లేని కారణంగా వద్దన్నాను. కానీ వాళ్ళు మాత్రం తప్పదన్నారు. ఇక చేసేదేం లేక తాగేశాను. అది కాస్తా బాగా ఎక్కేసింది. అలా మత్తు ఎక్కిన టైం లో ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. అక్కడే ఉదయం 6గంటల వరకు డాన్స్ చేస్తూనే ఉన్నాను. అలాగే లాబీలోకి వెళ్లిపోయాను. కనిపించిన ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టుకుంటూ పోయానంటూ చెప్పుకొచ్చింది.

