తమిళ్ నే ఎందుకు హైలెట్ చేస్తున్నారు

మహేష్ బాబు - మురుగదాస్ కలయికలో రాబోతున్న 'స్పైడర్' సినిమా తమిళం, తెలుగులో ఏకకాలంలో తెరకెక్కింది. ఈ సినిమా రెండు భాషల్లోనూ ఈ నెల 27 న దసరా కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే పబ్లిసిటీ ని ఒక రేంజ్ లో మొదలు పెట్టిన చిత్ర బృందం ఇప్పుడు చెన్నై లో జరగబోయే 'స్పైడర్' ఆడియో వేడుక మీద దృష్టి సారించింది. తెలుగులో పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నప్పటికీ అక్కడ తమిళంలో మాత్రం 'స్పైడర్' పాటలను భారీ లెవల్లో విడుదల చెయ్యడానికి ఏర్పాట్లు షురూ అయ్యాయి.
అయితే ఒకే వేదికమీద 'స్పైడర్' తెలుగు, తమిళ పాటలను విడుదల చెయ్యాలని భావిస్తుంది చిత్ర బృందం. అంటే తెలుగులో మార్కెట్ లోకి వదిలేసి.... తమిళ పాటలను మాత్రం గ్రాండ్ గా విడుదల చెయ్యడం, అలాగే సినిమాని తెలుగు కన్నా ఎక్కువగా తమిళంలోనే ప్రమోషన్స్ చేయడం, అలాగే మహేష్ ని తమిళంలో గ్రాండ్ గా లాంచ్ చెయ్యడం చూస్తుంటే 'స్పైడర్' కి తెలుగు కన్నా ఎక్కువగా తమిళంలోనే క్రేజ్ తీసుకు వస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇక తమిళంలో ఆడియో వేడుకని తెలుగు ఛానల్స్ ఏవి లైవ్ కవరేజ్ చెయ్యవు.
అయితే ఇప్పుడు 'స్పైడర్' తమిళ ఆడియో కోసం బాహుబలితో క్రేజ్ కొట్టేసిన టాలీవుడ్ టాప్ డెరెక్టర్ ని అతిధిగా పిలవడం... అలాగే '2.0 ' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ని సంపాదించిన శంకర్ ని తీసుకు రావడంతో 'స్పైడర్' పై అంచనాలు పెంచగలిగారు. కానీ రాజమౌళి - శంకర్ కలిసి 'స్పైడర్' ఆడియో ని విడుదల చేస్తే ఆ క్రేజ్ తమిళం కి పనికొస్తుంది కానీ తెలుగుకి ఎలాంటి ప్రమోషన్ ఉండదు. మరి ఇక్కడ తెలుగులో చేసే 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంత గ్రాండ్ గా చేసినా మళ్ళీ మళ్ళీ రాజమౌళి, శంకర్ ని పిలిస్తే ఏం బావుంటుంది. మరి ఎలాంటి అతిధులు వచ్చినా తెలుగులో రాజమౌళి, శంకర్ లు కలిసొస్తే గనక 'స్పైడర్' కి తెలుగులో వచ్చే క్రేజే వేరబ్బా... మరి మురుగదాస్ తమిళ డైరెక్టర్ కావడం వలెనే 'స్పైడర్' ని తమిళంలో ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాడా? అనే అనుమానంలో మహేష్ అభిమానులు కొట్టేసుకుంటున్నారు.

