తమిళంలో హీరో కథే!!

మహేష్ బాబు - మురగదాస్ కలయికలో వచ్చిన స్పైడర్ సినిమా కి తెలుగు వెర్షన్ కి అనుకున్న స్పందన రావడం లేదు. తొలి రోజు రికార్డులు బద్దలు కొట్టలేకపోయిన ఈ సినిమా.... రెండో రోజు కూడా యావేరేజ్ గానే పెర్ఫార్మ్ చేసింది. తెలుగు లో స్పైడర్ చూసిన ప్రేక్షకులంతా మహేష్ బాబుని తక్కువ చేసి విలన్ సూర్య ని ఎక్కువ చెయ్యడం పెద్దగా జీర్ణించుకోలకపోతున్నారు. అయితే పొరుగు రాష్ట్రం తమిళంలో.. మహేష్ మొదటిసారి కాలుపెట్టిన స్పైడర్ సినిమా మాత్రం దుమ్ము రేపుతుంది అని అంటున్నారు. . తెలుగు హీరో అయినా మహేష్ డైరెక్ట్ గా తమిళం లో చేసిన సినిమాకి వస్తోన్న వసూళ్లు చాలా బాగున్నాయని అక్కడి ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
తమిళ విమర్శకుల మంచి మార్కులు...
అంతేకాకుండా స్పైడర్ కి తమిళ విమర్శకులు మంచి మార్కులు వేస్తున్నారు. కానీ తెలుగులో మాత్రం పాపులర్ క్రిటిక్స్ ఈ స్పైడర్ సినిమాని యావరేజ్ అని తేల్చేసారు. అయితే ఈ సినిమాకి తమిళం లో ఎందుకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అంటే మురగదాస్ ఈ సినిమాని ఒక సూపర్‌స్టార్‌తో తీసే సినిమాలా కాకుండా ఒక యువ హీరోతో తీసే చిత్రంలా తీర్చిదిద్దాడు. అందుకే ఈ సినిమాకి అక్కడ తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అంటున్నారు. విలన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి హీరోని అంతగా ఎలివేట్ చేయలేదు ఈ సినిమాలో... తమిళంలో మహేష్‌కి ఎలాంటి ఇమేజ్ లేకపోవడంతో స్టార్ హీరో సినిమాలా వారు దీనిని చూడడం లేదు.
మహేష్ ను డమ్మీ చేసేసరికి.....
ఇక మురుగదాస్ కూడా ముందునుండి తమిళంలో హీరో మహేష్ కాదని.. కథే హీరో అని చెబుతూనే ఉన్నాడు. కానీ తెలుగులో మాత్రం మహేష్ అభిమానులే కాక ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో హీరో మహేష్ అనుకున్నారు కాబట్టే ఈ సినిమా తో నిరాశచెందారు. హీరోయిజం బాగా చూపిస్తాడని పేరున్న మురుగదాస్ ఇలా విలన్ మీద సినిమా తీసి అందులో మహేష్‌ని డమ్మీ చేసేసరికి అభిమానులు బాగా డల్ అయిపోయారు. కేవలం తమిళం కోసం ఈ చిత్రం తీసి తెలుగులోకి అనువదించినట్లయితే మనవాళ్ల నుంచి బెటర్ రెస్పాన్స్ వచ్చేదేమో అంటూ ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
- Tags
- స్పైడర్

