తప్పు దోవ పట్టిస్తే సెలబ్రిటీస్ పై నిషేధం

భారత దేశంలో సినిమా రంగానికి, క్రీడలలో క్రికెట్ కి వున్న అమితమైన ఆదరణ మారె రంగానికి దక్కదు. భారత దేశస్థులలో చాలా మంది ఈ రంగాలలో ప్రసిద్ధి చెందిన ప్రముఖులను స్ప్పోర్తిగా తీసుకుంటుంటారు. దీన్ని తమకు అనుకూలంగా కాష్ చేసుకుంటుంటాయి ప్రముఖ కంపెనీలు. వారి ఉత్పత్తులకు సినీ, క్రికెట్ రంగాలలోని ప్రముఖుల చేత ప్రచారం చేపించి వ్యాపారాన్ని పెంచుకుంటుంటాయి అనేక బ్రాండ్లు. ఒక్కో చిత్రంలో నటిస్తే పొందే పారితోషికాన్ని, వాణిజ్య ప్రకటనలకు కూడా పొందుతుంటారు సినీ తారలు. పైగా చిత్రానికి పనిచేయటం అంటే దాదాపు 100 రోజులు శ్రమించాలి. ప్రకటనలకు అయితే ఏడాది ఒప్పందంలో కేవలం పది రోజులు శ్రమించి కోట్ల రూపాయల పారితోషికం పొందుతుంటారు.
అధిక పారితోషికాలు అందుతుండటంతో రకరకాల వాణిజ్య ప్రకటనలలో నటించే అవకాశాల కోసం తపిస్తుంటారు ప్రముఖ సినీ తారలు, క్రికెటర్లు. వాటిలో కొన్ని ప్రజలను తప్పు దోవ పట్టించే రీతిలోను సాగే ప్రకటనలు వుంటుంటాయి. వీటిని అరికట్టటానికి గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్ 2015 ను ప్రవేశ పెట్టింది. ఈ బిల్ ను తప్పు దోవ పట్టించే ప్రకటనలను ప్రచారంలోకి తెచ్చిన సంబంధిత ప్రముఖులకు ఏడాది పాటు జైలు శిక్ష విధించేలా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆ బిల్ సవరణలకు గురి అయ్యి, సంబంధిత సెలబ్రిటీస్ నుంచి మొదటి సారి పది లక్షల రూపాయల జరిమానా, మరియు ఏడాది పాటు వాణిజ్య ప్రకటనల నుంచి నిషేధం. ఒకసారికి మించి తప్పిదం చేస్తే 50 లక్షల రూపాయల జరిమానా తో పాటు మూడు సంవత్సరాల నిషేధం విధించే విధంగా మార్పులు చేస్తున్నారు.

