తన రికార్డు తానే బద్ధలు కొట్టిన సూపర్‌స్టార్
మలయాళం లో ఇప్పటివరకు ఏ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరలేదు. మొదటిసారి 100 కోట్ల క్లబ్ లో చేరి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏజ్ లోను తనలోని పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు మోహన్ లాల్. మొట్టమొదటిసారి 100 కోట్ల క్లబ్‌లోకి చేరి తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. మోహన్ లాల్ నటించిన ‘పులి మురుగన్’ సినిమా కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించి ఏకంగ 100 కోట్ల క్లబ్ లో కాలు పెట్టింది. ఈ సినిమా అంతా అడవి నేపథ్యంలో తెరకెక్కింది. ఇంతకుముందు మోహన్ లాల్ దృశ్యం సినిమాతో 50 కోట్ల వరకు కొల్లగొట్టాడు.
మళ్ళీ ఆ మధ్యన వచ్చిన ఒప్పం చిత్రం కూడా భారీ కలెక్షన్స్ సాధించింది. దృశ్యంతోనే 50 కోట్ల క్లబ్ ని చేరుకున్న మోహన్ లాల్ అప్పట్లో రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు మళ్ళీ తన సినిమాతోనే తన సినిమా రికార్డు బద్దలు కొట్టుకున్నాడు. అప్పట్లో 50 కోట్లతో సంచలనం సృష్టిస్తే ఇప్పుడు ‘పులి మురుగన్’ తో 100 కోట్ల క్లబ్ లో కూర్చున్నాడు. ‘పులి మురుగన్’ చిత్రం కేరళ, అమెరికా, యూకె, యూరప్ల్లోని ఇలా అన్నికేంద్రాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం లో మోహన్ లాల్ కి జోడిగా కమలిని నటించింది.