ఢీలా పడ్డ మెగా ప్రిన్సెస్

మెగా బ్రదర్స్ లో మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ తాను సంపాదించుకునే ప్రయత్నం ఎప్పుడూ కొణిదల నాగ బాబు చెయ్యలేదు. కానీ తన వారసులకు మెగా అభిమానుల అండ ఉండాలని మాత్రం మొదటి నుంచి శ్రమిస్తూనే ఉన్నారు. అయితే నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ మెగా అభిమానుల వ్యక్తిగత అంచనాలకు విరుద్ధంగా కంచె వంటి గొప్ప చిత్రంలో నటించి రెండవ చిత్రానికే ఎనలేని కీర్తి సంపాదించాడు. ఆ చిత్రం వరుణ్ తేజ్ ని అగ్ర హీరోల జాబితాకు ఎక్కించకపోయినా విమర్శకుల దగ్గర వరుణ్ కి మంచి మార్కులనే సాధించి పెట్టింది.
ఇక నాగ బాబు దిగులాల్లా ఆయన కుమార్తె నిహారిక కొణిదల విషయం లోనే. బుల్లి తెర పై వయోక్త గా అనతి కాలం లోనే గొప్ప స్థానం సంపాదించుకున్న నిహారికకు సినిమా మోజు ఉండటంతో వెండి తెర పై మెరిసే అవకాశాలు ఎన్ని వచ్చినా జల్లడ పట్టి మరీ ఒక మనసు చిత్రాన్ని ఎంచుకుంది కొణిదల కుటుంబం. మాస్ ఎలెమెంట్స్ ఉన్న కథ అయితే విజయవంతమైనా హీరో మరియు దర్శకులకే పేరు వస్తుంది అని, కాబట్టి మెగా ప్రిన్సెస్ కి పరిచయ చిత్రంగా ఒక మనసు సరైన చిత్రం అని భావించారు నాగ బాబు. ఆ చిత్ర చిత్రీకరణ సమయంలోనే అనేక అవకాశాలు నిహారికకు వెల్లువెత్తటంతో వాటిలో కొన్ని చిత్రాలకు సంతకం చేసింది.
కానీ ఒక మనసు ఘోర పరాభవంతో నిహారిక తో ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలు అందరూ ఇప్పుడు మొఖం చాటేస్తున్నారు. దాంతో నిహారికకు అటు బుల్లి తెర అవకాశాలు తగ్గి, ఇటు వెండి తెర అవకాశాలు లేక ఢీలా పడిపోయింది అంట పాపం.

