డిసాస్టర్ టాక్ తో కూడా 2 మిలియన్ అందుకున్నాడే

ఓవర్ సీస్ లో తొలి నుంచి అత్యధిక మార్కెట్ కలిగిన తెలుగు హీరో అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు పేరే గుర్తొస్తుంది ఎవరికైనా. అతడు తో ఓవర్ సీస్ మార్కెట్ ఓపెన్ చేసి ఒక్కో చిత్రం తో ఆ మార్కెట్ ని విస్తృతంగా వ్యాపించుకుంటూ వచ్చారు మహేష్ బాబు. మెగా ఫామిలీ హీరోలకి తెలుగు రాష్ట్రాలలో క్రేజ్ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఓవర్ సీస్ లో వీరి సినిమాలకి గిరాకీ చాలా ఆలస్యంగా ప్రారంభమైన మాట మాత్రం వాస్తవం. అయితే ఇప్పుడు ఈ లెక్కలన్నీ మార్చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం అజ్ఞ్యాతవాసి.
ముందుగా అమెరికా దేశంలోని ప్రీమియర్ షోస్ తోనే విడుదలైన అజ్ఞ్యాతవాసి డిసాస్టర్ టాక్ సొంతం చేసుకుని రెండవ రోజు నుంచే పేలవమైన వసూళ్లతో నలిగిపోతుంది. కానీ అమెరికా లో మాత్రం ఇతర హీరోల(మహేష్ బాబు మినహా) సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలకి కూడా సాధ్యపడని 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని తొలి వారం పూర్తయ్యే సరికి చేరుకొని కొత్త రికార్డు సాధించాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే అజ్ఞ్యాతవాసి చిత్రం, కళ్యాణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది చిత్ర అమెరికా దేశంలో క్లోసింగ్ గ్రాస్ ని అధిగమించేసిన సంగతి తెలిసిందే.

