డిజాస్టర్ వైపు పరుగులు పెడుతుంది

బాలకృష్ణ తాజా చిత్రం 'పైసా వసూల్' పైసల్ రాబట్టలేక చతికిల పడిందనే టాక్ మొదలైంది. మాస్ మసాలా ఎంటెర్టైనర్ గా తీర్చి దిద్దిన దర్శకుడు పూరి జగన్నాధ్ కి 'పైసా వసూల్' గట్టి దెబ్బె వేసిందంటున్నారు. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా గత శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మిక్సడ్ టాక్ ని సొంతం చేసుకోవడమే కాక మొదటి రోజు గట్టి ఓపెనింగ్స్ పడ్డాయి. ఈ సినిమాతో బాలకృష్ణ మొదటి రోజున 7 కోట్లు కొల్లగొట్టి తన కెరీర్ లోనే సెకండ్ హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టాడు. ఇక రెండో రోజు కూడా కలెక్షన్స్ పెరుగుతాయని కాస్త ఆశ పడిన నిర్మాతలకు ఆ ఆశ నిరాశే అయ్యింది.
రెండో రోజు నుండే 'పైసా వసూల్' కలెక్షన్స్ డ్రాప్ అయినట్లుగా... విపరీతంగా కలెక్షన్స్ పడిపోయినట్లుగా చెబుతున్నారు. ఆదివారం 'పైసా అవసూల్' ఒక మాదిరిగా కలెక్టచేయ్యగా సోమ, మంగళ వారాల్లో మాత్రం 'పైసా వసూల్' రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ దెబ్బకి 'పైసా వసూల్' మొత్తం ఐదు రోజులకు గాను 15 కోట్లు మాత్రమే కొల్లగొట్టినట్టుగా సమాచారం అందుతుంది. మరి కేవలం 15 కోట్లు మాత్రమే కొల్లగొట్టడం చూస్తుంటే ఈ ఈసినిమా డిజాస్టర్ వైపు పరుగులు పెడుతుందని... ఈదెబ్బకి 'పైసా వసూల్' బయ్యర్లు పైసల్ వసూల్ కాక నానా ఇబ్బందులు పడే అవకాశం ఉందంటూ సంకేతాలు అందుతున్నాయి. మరి గౌతమి పుత్ర బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన ఈ 'పైసా వసూల్' తో దెబ్బతిన్న బాలయ్యకి 102 వ చిత్రమైన సూపర్ హిట్ అవ్వాలని... నందమూరి ఫాన్స్ దేవుళ్ళని మొక్కుతున్నారు.

