డబ్బే ముఖ్యమా?

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నప్పుడే అభిషేక్ బచ్చన్ ని ప్రేమించి పెళ్లాడింది. పెళ్ళికి ముందు ఎడా పెడా సినిమాలు చేస్తూ డబ్బు సంపాదించినా ఐశ్వర్య రాయ్.. పెళ్లి తర్వాత అమితాబచ్చన్ ఫ్యామిలీ నీడలో ఒక కూతుర్ని కని ఆమె సంరక్షణ మాత్రమే కాకూండా తన అందాలకు మెరుగు దిద్దుతూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలు మొదలు పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఐష్ అందాల ఆరబోత ఏమాత్రం తగ్గలేదు. అయితే అడపా దడపా సినిమాలు చేస్తున్న ఐశ్వర్య ప్రస్తుతం తన భర్త అభిషేక్ తో కలిసి నటించే అవకాశాన్ని వదులుకుందట. ఇంతకీ విషయం ఏమిటంటే....ఒక దర్శకుడు ఐష్, అభిషేక్ దగ్గరకెళ్ళి కథ చెప్పగా... కథను విన్న వెంటనే ఆ సినిమాలో నటించేందుకు భార్యాభర్తలు ఐష్, అభిషేక్ లు ఓకే చెప్పారట.
కానీ ఐష్ మాత్రం కథలో చిన్నపాటి మార్పులు చేయాలంటూ దర్శక నిర్మాతలకు సూచించిందట. మరి ఐష్ఐ లాంటి అందగత్తె కోరితే దర్శక నిర్మాతలు ఊరుకుంటారా... వెంటనే ఐష్ కోరిన విధంగానే వారు కథలో మార్పులు చేసి ఐశ్వర్య దగ్గరకి తీసుకెళ్ళడట. అలా దర్శకుడు ఐష్ దగ్గరకెళ్ళగానే మీ సినిమా చేయలేనని ఐష్ ఆ దర్శకుడికి మొహమాటం లేకుండా చెప్పేసిందట. అదేమిటి కథ మారిస్తే సినిమా చేస్తానని చెప్పారు గదా అని సదరు దర్శకుడు అడగగా... దానికి ఐష్ వేరే సినిమా కోసం ఆల్రెడీ పది కోట్లు తీసుకున్నాని.... పది కోట్లు వారు ఇస్తుంటే ఆ సినిమా ఎలా వదులుకుంటానని చెప్పినదట.
ఒకవేళ మీరు పది కోట్లు ఇస్తే మీ సినిమానే చేస్తా.. లేదంటే ఈ సినిమా పూర్తయ్యేవరకు వెయిట్ చెయ్యమని మొహం మీదే చెప్పిందట. మరి భర్తతో కలిసి హాయిగా నటించక ఇలా డబ్బు కోసం అలా సినిమాని వదులుకోవడం ఏం బావోలేదని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు.

