టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కి వార్ణింగా..?

ఇప్పుడు టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒక స్టార్ హీరో ఒక స్టార్ డైరెక్టర్ కి డెడ్ లైన్ విధించాడనే న్యూస్ సోషల్ మీడియా సాక్షిగా హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ న్యూస్ ఏమిటంటే దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ 'రంగస్థలం 1985 ' చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం మొదలు పెట్టుకుని నెలలు గడుస్తున్నా ఈ సినిమా షూటింగ్ మాత్రం ఒక కొలిక్కి రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత సీన్స్ అన్ని షూట్ చేసినా.. మిగతా చాలా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే చాలా పాటల చిత్రీకరణ కూడా పెండింగ్ లోనే ఉంది.
మరి సినిమా మొదలు పెట్టి చాలా కాలం గడుస్తున్నా సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో.. రంగస్థలం నిర్మాతలు వడ్డీ లెక్కలు అవి వేసుకుంటే... చాలా ఎక్కువ బడ్జెట్ ఈ సినిమాకి అవుతుందనే టాక్ వుంది. అలాగే నవంబర్ కల్లా సుకుమార్ ని ఈ సినిమా షూటింగ్ పూర్తి చెయ్యమని... లేకుంటే ఆ తర్వాత తన డేట్స్ సర్దుబాటు చేయలేనని 'రంగస్థలం' హీరో రామ్ చరణ్ సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టినట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నవంబర్ ఎండ్ కల్లా తనకు సంబందించిన షూట్ మొత్తం కంప్లీట్ చేసుకోమని దర్శకుడికి చరణ్ చెప్పాడనే న్యూస్ హల్చల్ చేస్తుంది.
తనకి నవంబర్ ఎండ్ నుండి తన తండ్రి 'సై రా నరసింహారెడ్డి' సినిమాకి సంబందించిన పనులు ప్రారంభమవుతాయని....ఇక 'సై రా' నిర్మాతగా తాను బిజీ అవుతానని.. అందుకే 'రంగస్థలం' షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేసుకోమని సుకుమార్ తో చరణ్ చెప్పాడట. మరి చరణ్ చెప్పిన డెడ్ లైన్ కి సుకుమార్ రీచ్ కాగలడా...అంటున్నారు. ఎందుకంటే సుకుమార్ తన సినిమాలను హరీబరిగా తెరకెక్కించడు. చాలా నెమ్మదిగా తన సినిమాని నీట్ అండ్ క్లీన్ గా చెక్కుతూనే ఉంటాడు. అయితే అసలు చరణ్.. సుకుమార్ కి డెడ్ లైన్ పెట్టడం నిజమేనా? లేదా కేవలం గాసిప్పా... అనేది మాత్రం క్లారిటీ లేదు.

