టాలీవుడ్ సినిమాల షూటింగ్స్ అప్ డేట్

టాలీవుడ్ లో పలు సినిమాల షూటింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. నాని ఎంసీఏ, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, కళ్యాణ్ రామ్ ఎమ్యెల్యే, బాలకృష్ణ జై సింహ.. ఇంకా సాయి ధరమ్ తేజ - వినాయక్ సినిమా షూటింగ్స్ అప్ డేట్ మీ కోసం:
జై సింహా:
బాలయ్య పైసా వసూల్ తర్వాత చేస్తున్న 102వ సినిమా జై సింహాని తమిళ డైరెక్టర్ ఏ ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్నాడు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. వైజాగ్ బీచ్ రోడ్ లో 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, 110 బస్సులతో మహా ధర్నా సీక్వెన్స్ షూటింగ్ జరుగుతోంది. అంతేకాకుండా ఇదే షెడ్యూల్ లో బాలకృష్ణ - హరిప్రియలపై ఓ రొమాంటిక్ సాంగ్ తో పాటు.... బాలయ్యపై ఓ మాంటేజ్ సాంగ్ ను షూట్ కూడా చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నయనతార, నటాషా దోషి, హరిప్రియలు నటిస్తున్నారు.
అజ్ఞాతవాసి: PSPK 25
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమాకు దాదాపు అజ్ఞాతవాసి అనే టైటిల్ ఫిక్స్ చేసే యోచనలో చిత్ర బృందం ఉంది. నిన్న మంగళవారం నుండి ఈ సినిమా షూటింగ్ యూరోప్ లోని బల్గేరియా దేశంలో ప్రారంభమైంది. ఈ షూట్ లో పాల్గొనేందుకు పవన్ మరియు చిత్ర బృందం ఇప్పటికే బల్గేరియా చేరుకోగా.. హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ మాత్రం ఈ రోజు బుధవారం అక్కడికి చేరుకుంది. ఈ షెడ్యూల్ లో పవన్ - అను ఎమ్మాన్యుయేల్ కాంబినేషన్ లో ఒక పాట అలాగే.... పవన్ -కీర్తి సురేష్ కాంబినేషన్ లో మరో పాట తెరకెక్కించనున్నారు. అంతేకాకుండా పవన్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ కూడా ఇక్కడే బల్గెరియాలో చిత్రికరణ జరపనున్నారు.
ఎమ్మెల్యే:
కల్యాణ్ రామ్ - ఉపేంద్ర కలయికలో తెరకెక్కుతున్న ఎమ్యెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమా షూటింగ్ జోరుగా జరుగుతుంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యేకు సంబంధించిన చిత్రీకరణ నిర్మల్ పరిసరప్రాంతాల్లో జరుగుతుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కాజల్ మరియు మధు లగ్నదాస్ లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు.
ఎంసీఏ:
వేణు శ్రీరామ్ - నాని కలయికలో తెరకెక్కుతున్న ఎంసీఏ సినిమా షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్ లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
సాయిధరమ్ తేజ్ - వినాయక్ సినిమా:
వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని మేడ్చల్ ప్రాంతంలో జరుగుతోంది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేసుకొని ఈ సినిమాకి సంబందించిన కొన్ని సన్నివేశాలను సాయిధరమ్ తేజ్, రఘుబాబు, మరికొందరు కమెడియన్స్ పై చిత్రీకరిస్తున్నారు. నవంబర్ 2వ తేదీ అంటే రేపటినుండి పబ్ సెట్ లో సాంగ్ షూట్ ఉంటుంది. దీనికోసం చిత్ర బృందం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓపెన్ పబ్ సెట్ ని వేస్తున్నారు. ఈ సినిమాకి ఇంటలిజెంట్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

