టాలీవుడ్ సినిమా అప్ డేట్స్ మీ కోసం!!

టాలీవుడ్ లో బడా స్టార్స్ తోపాటు చిన్న హీరోల సినిమాల షూటింగ్ కూడా జోరుగా జరుగుతుంది. డిసెంబర్, జనవరి సెలవులకు విడుదలవుతున్న సినిమాలతోపాటు మిగతా సినిమాల షూటింగ్ అప్ డేట్స్ రామరామిగా....
హలో....?
అక్కినేని అఖిల్ రెండో సినిమా హలో. ప్రస్తుతానికి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇప్పటికే అన్నపూర్ణ స్టుడియోస్ లో కొన్ని సన్నివేశాలు తీయగా.. తాజాగా గండిపేట్ పరిసర ప్రాంతాల్లో మరికొన్ని సీన్స్ తీస్తున్నారు. ఈ సినిమాతో లిజి మరియు దర్శకుడు ప్రియదర్శన్ కూతురు కల్యాణి హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఇకపోతే హలో టీజర్ నిన్న గురువారం సాయంత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకోగా... ఈ సినిమాని నాగార్జున డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నాడు.
అజ్ఞాతవాసి....
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ k లో తెరకెక్కుతున్న సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా ప్రస్తుతం బల్గేరియా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ డీటెయిల్స్ ను త్వరలోనే వెల్లడిస్తారు. హీరోయిన్లు అను ఎమ్మాన్యుయేల్, కీర్తిసురేష్ ఇండియాకు వచ్చేస్తే.. పవన్ మాత్రం ఓ అవార్డు అందుకునేందుకు అట్నుంచి అటే.. లండన్ వెళ్లిపోయాడు.
రంగస్థలం....
రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం షూటింగ్ మరోసారి బూత్ బంగ్లాలో ప్రారంభమైంది. దీనికి సమీపంలో వేసిన జాతర సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సమంత పెళ్లి, రిసెప్షన్ పనులు పూర్తి చేసుకుని రంగస్థలం షూటింగ్ సెట్స్ మీదకొచ్చేసింది. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
వినాయక్, సాయిధరమ్ తేజ్ సినిమా...
ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కానీ ఈ సినిమాకు దుర్గ లేదా ఇంటలిజెంట్ అనే టైటిల్స్ ఒకటి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. పక్కా మాస్ ఎంటెర్ టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ ఓల్డ్ సిటీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. రౌడీలను ఛేజ్ చేసి పట్టుకొనే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వీవీ వినాయక్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్.
సవ్యసాచి....
పెళ్లి తర్వాత నాగచైతన్య స్టార్ట్ చేసిన సినిమా సవ్యసాచి. ప్రేమమ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ మీదకెళ్లింది. ఈమధ్యే సినీరాజకీయా ప్రముఖులకు పెద్ద రిసెప్షన్ ఇచ్చిన చైతూ.. అది కంప్లీట్ అయిన వెంటనే సవ్యసాచి సెట్స్ పైకి షిఫ్ట్ అయ్యాడు. ఈ సినిమా కోసం చిలుకూరు సమీపంలో పెద్ద సెట్ వేశారు. ప్రస్తుతం సవ్యసాచి షూటింగ్ అక్కడే జరుగుతోంది. నాగచైతన్య, హీరోయిన్ నిధి అగర్వాల్, కమెడియన్ సత్య కాంబినేషన్లో కొన్ని సీన్లు తీస్తున్నారు.
- Tags
- టాలివుడ్ న్యూస్

