టాలీవుడ్ ను ఛీకొట్టాక.. బాలీవుడ్లో సెటిలవుతోంది

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా వెండి తెరకు పరిచయం అయినప్పటికీ ఢిల్లీ భామ తాప్సి పన్ను కు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర తారగా వెలిగే దిశగా మార్గం సుగమం కాకపోవటంతో ఇతర భాషల్లో నటిస్తూ కొంత కాలం అడపా దడపా తెలుగు సినిమాల్లో నటిస్తూ ఉండేది. మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం తప్ప మరే ఇతర చిత్రాలు తాప్సి కి సక్సెస్ ఇవ్వకపోవటంతో అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. ఈ తరుణంలోనే బాలీవుడ్ లో అడుగు పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హిందీ చిత్ర పరిశ్రమ తాప్సి ప్రతిభని బాగానే గుర్తించి వరుస అవకాశాలతో తాప్సి కెరీర్ పుంజుకునేలా ఉపయోగపడింది.
ఇటీవలి కాలంలో పింక్ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిచి నటించేయటంతో తాప్సి గుర్తింపు మరింత పెరిగింది. పింక్ విజయానంతరం తెలుగు చిత్ర పరిశ్రమ తన ప్రతిభకు తగిన పాత్రలు ఇవ్వలేకపోయింది అని వ్యాఖ్యలు కూడా చేసింది. అప్పటికే ముంబైలో తన సొంత ఫ్లాట్ లో నివాసముంటున్న తాప్సి ఇప్పుడు ఆ ఇల్లు ఇరుకుగా ఉంటుంది అని ముంబైలోనే ఓషివారా అనే ప్రాంతంలో మరో విశాలవంతమైన ఇంటిని నిర్మించుకుంటుంది అంట తాప్సి. ఒక సొంత ఇల్లు ఉండగా మరో కొత్త ఇంటిని కూడా ముంబై నగరంలోనే నిర్మించుకునే సరికి ఇక తాప్సి బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైంది అని అందుకే శాశ్వతంగా అక్కడే నివాసం ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి తాప్సి ఇక నుంచి కేవలం హిందీ చిత్రాలకే పరిమితమవుతుందా అనే ప్రశ్న కి సమాధానం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తాప్సి కి ఏదైనా అవకాశం వరించినప్పుడే తెలుస్తుంది.

