Tue Mar 31 2026 11:34:53 GMT+0530 (India Standard Time)
జై సింహ స్టోరీ ఇదేనా??

బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం జై సింహ. ఈ సినిమా మొదలైనప్పటి నుండి కథ గురించి ఇండస్ట్రీలో చాలా పుకార్లు వచ్చాయి. ముందు ఈ సినిమాకు కర్ణ అనే పెట్టాలనుకున్న, చివరకు జై సింహ గా పెట్టారు. కర్ణ టైటిల్ పెట్టాలనుకోవడం ఈ సినిమా కథే అని టాక్.
ఈ సినిమాలో బాలయ్య భగ్న ప్రేమికుడట. హీరోయిన్ నయనతార ని ప్రేమిస్తాడు కానీ ఆమెకు కిక్ శ్యామ్ తో పెళ్లి అయిపోతుందంట. అయినా గాని బాలయ్య , ఆమెకు అండగా ఉండటం, ఆమె కోసం త్యాగాలు చేయటం అన్నది కథ అని వార్తలు వస్తున్నాయి.
కేఎస్ రవికుమార్ ఎమోషనల్ కంటెంట్ ను తెర పై బాగా చూపించగలడు. అలాగే బాలయ్య కూడా ఎమోషనల్ మూవీస్ లో చెలరేగిపోతాడు. వీరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అభిమానుల ఊహకి తగ్గట్టుగానే ఉంటుందని.....జై సింహ కచ్చితంగా ఫ్యాన్స్ కు సరైన పొంగల్ ట్రీట్ నే అనుకోవాలి
Next Story

