జై సింహ వరల్డ్ వైడ్ క్లోసింగ్ బిజినెస్!

రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ - నయనతార జంటగా నటించిన జై సింహ సినిమా ఈ సంక్రాంతికి విడుదలై యావరేజ్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సంక్రాతి బరిలో అజ్ఞాతవాసి, తమిళ గ్యాంగ్ సినిమాల్తో పోటీ పడిన బాలకృష్ణ జై సింహ బిసి సెంటర్స్ లో కాస్త హంగామా చేసింది. అయితే జై సింహ లో బాలకృష్ణ వయసు పైబడినట్లుగా కనబడం, కథలో కొత్తదనం లేకపోవడంతో జై సింహ అంచనాలు అందుకోలేక చతికిల పడింది. మరి జై సింహ సినిమా విడుదలైన 20 రోజులకే థియేటర్స్ నుండి బిషాణా ఎత్తేసింది. ఇక జై సింహ వరల్డ్ వైడ్ క్లోజింగ్ బిజినెస్ వివరాలు మీకోసం.
ఏరియాల వారీగా జై సింహ వరల్డ్ వైడ్ చ్లొసింగ్ కలెక్షన్స్ కోట్లలో
నైజాం 4.15
సీడెడ్ 5.46
నెల్లూరు 1.27
కృష్ణా 2.15
గుంటూరు 2.47
వైజాగ్ 3.77
ఈస్ట్ గోదావరి 2.57
వెస్ట్ గోదావరి 2.09
మొత్తం ఏపీ & టీస్ షేర్ 23.93 కోట్లు
కర్ణాటక 1.85
రోయ్ & రో 0.99
యూఎస్ఏ 0.45
మొత్తం వరల్డ్ వైడ్ షేర్ కోట్లలో 28.52 కోట్లు

