'జై సింహ' ఫస్ట్ లుక్ అదుర్స్

బాలకృష్ణ - రవికుమార్ కలయికలో తెరకెక్కుతున్న' జై సింహ'.... షూటింగ్ ని పరిగెత్తిస్తున్నారు. బాలకృష్ణ రెండు పాత్రల్లో కనబడనున్న ఈ సినిమాలో నయనతార మెయిన్ హీరయిన్ గా... నటాషా దోషి, హరిప్రియలు సెకండ్ అండ్ థర్డ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 'జై సింహ' గా బాలయ్య నట విశ్వరూపం ఈ సినిమాలో చూడబోతున్నారని చెబుతుంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో బాలయ్య ఎంత ఎనర్జీతో కనబడతాడో మొన్న చిత్ర బృందం విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ లో కనబడింది.
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది. 'జై సింహ' లుక్ లో బాలయ్య అదరగోడుతున్నాడు. ఈ లుక్ లో బాలయ్య కర్ర పట్టుకుని చాలా కొత్తగా కనపడ్డాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ విగ్రహం ఉండటం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో హైలైట్ గ నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం వైజాగ్ లో జరుగుతుంది. బాలయ్య కాస్ట్యూమ్ కూడా పోస్టర్ లో చాలా బాగుందని చెప్పుకోవొచ్చు.
ఏదిఏమైనా ఈ పోస్టర్ ఫాన్స్ కి పండగలాంటిది. ఫస్ట్ లుక్ ఏ ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఇంకా ఏ రేంజ్ లో వుంటదో. పోస్టర్ చూస్తుంటే ఇది పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని చెప్పుకోవొచ్చు. దర్శకుడు రవికుమార్ మేకింగ్ కూడా చాలా బాగుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నందమూరి ఫాన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది.

