'జై లవ కుశ'పై నెగెటివ్ ప్రచారం

ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. విడుదలకు పట్టుమని పది రోజులు కూడా లేదు. ఇక ఈ సినిమాకి సంబందించిన పబ్లిసిటీ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే పాటలను, థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ ఆద్యంతం ఎన్టీఆర్ జై పాత్రతో కేక పుట్టించాడని ఎన్టీఆర్ అభిమానులు తెగ ఇదైపోతున్నారు. రావణ పాత్రలో ఎన్టీఆర్ నటన ఆద్భుతమంటూ అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులు, టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ కూడా 'జై లవ కుశ' ట్రైలర్ ని పొగిడేస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ 'జై లవ కుశ' ని నటరత్న సీనియర్ ఎన్టీఆర్ 'దానవీర శూరకర్ణ'తో పోల్చిచెప్పుకోవడం అన్నగారి అభిమానులకు, బాలయ్య ఫ్యాన్స్‌కు, నందమూరి ఫాన్స్ కి నచ్చలేదని అంటున్నారు. ఇక కళ్యాణ్ రామ్ అయితే నిన్న ఆదివారం జరిగిన 'జై లవ కుశ' ట్రైలర్ లాంచ్ వేడుకలో ఎన్టీఆర్ కి 'జై లవ కుశ'తో నేషనల్ అవార్డ్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం చూస్తుంటే కాస్త ఎక్కువ అనిపించిందని అభిప్రాయంతో నందమూరి అభిమానులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి 'జై లవ కుశ'లో జై పాత్రలో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించాడనే మాట నిజమే గాని... ఆ నటనకే పెద్దాయనతో పోలిక పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు.
అలాగే 'జై లవ కుశ'లోని లవ కేరెక్టర్ బ్యాంక్ లో చేసే సన్నివేశాన్ని చిరంజీవి సినిమా నుండి కాపీ చేశారనే ప్రచారం జోరందుకుంది. బ్యాంక్ మేనేజర్ లవ పాత్రను చూపించిన ఆఫీస్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ‘రౌడీ అల్లుడు’లో చిరంజీవి ఆఫీస్ సీన్‌ని మక్కీకి మక్కి దర్శకుడు బాబి దించేసాడనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. మరి ఇప్పటికే సౌత్ కొరియన్ సినిమా ‘ది గుడ్.. ది బేడ్.. ది హగ్లీ.' సినిమాకు 'జై లవ కుశ' కాపీ అంటూ ప్రచారం ఉండనే ఉంది. మరి వీటన్నింటిపై పూర్తి క్లారిటీ రావాలి అంటే 'జై లవ కుశ' సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

