జెన్నీ రి ఎంట్రీ?

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు.. పోతుంటారు. కానీ ఎంత మంది వచ్చి వెళ్లినా అందులో కొంతమంది హీరోయిన్స్ ని ప్రేక్షకులు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారు. అందుకే వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలని కనీ మళ్లా సినిమాల్లోకి రి ఎంట్రీ ఇచ్చినా అక్కున చేర్చుకుంటారు. ఇకపోతే తెలుగు పరిశ్రమలో ప్రేక్షకులు ఎంతో మంది హీరోయిన్స్ ని మరిచిపోయినా గాని జెనిలియా ని మాత్రం మరిచిపోయే ఛాన్సే లేదు. ఎందుకంటే జెనిలియా తెలుగు లో చేసిన సినిమాలు, పాత్రలు అలాంటివి. ముఖ్యంగా జెనిలియా నటన చాలా బబ్లిగా, హోమ్లీగా ఉంటుంది.
తెలుగు లో కొన్ని సినిమాలు అయితే కేవలం జెనిలియా వల్లే నడిచాయి అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 'బొమ్మరిల్లు, డీ, రెడీ' వంటి సినిమాలలో నటించి మెప్పించిన ఈ హీరోయిన్ బాలీవుడ్ హీరో అయిన రితేష్ దేశ్ముక్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరం అయ్యింది. అంతేకాకుండా ఇద్దరు కొడుకులకు తల్లి కూడా అయ్యింది. ఇక గృహిణిగా తల్లిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన జెనీలియా మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ మధ్యన ముంబై లో ఓ ప్రైవేట్ ఫంక్షన్కు హాజరైన జెనిలియా మీడియాతో మాట్లాడింది. త్వరలో మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్నట్టు చెప్పుకొచ్చింది.
అయితే జెనీలియా తెలుగు సినిమాతో రి ఎంట్రీ ఇవ్వడం లేదట. ఒక మరాఠి సినిమాతో జెనీలియా మళ్ళీ సినిమాల్లోకి రి ఎంట్రీ ఇవ్వబోతుందట. అవును ఒక మరాఠి సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ఈ హీరొయిన్ అలాగే సౌత్ లాంగ్వేజెస్ లో మళ్ళీ నటించబోతుందని తెలిపింది. అయితే జెనీలియా మళ్ళీ హీరోయిన్ గానా లేదంటే ఏమైనా అక్క ఇలాంటి స్పెషల్ కేరెక్టర్స్ లో రి ఎంట్రీ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరి భర్త పిల్లలతో ఇన్ని రోజులు సమయాన్ని గడిపిన జెనిలియా ఇప్పుడు మళ్ళీ మేక్ అప్ వేసుకోబోతుంది.

