జూలీ 2 కథ.. ఆమెదేనా?

దక్షిణాదిన హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న లక్ష్మి రాయ్ ఇప్పుడు జూలీ 2 తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సినిమాతో లక్ష్మి రాయ్ బాలీవుడ్ లో తన లక్ ని పరిక్షించుకోవాలి అనుకుంటుంది. అందుకే ఈ సినిమా లో బాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఎన్నడూ లేనివిధంగా హాట్ హాట్ డ్రెస్‌లతో పిచ్చేకిస్తుంది లక్ష్మి రాయ్. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుకావాల్సి ఉండగా.. సెన్సార్ కారణాలతో ఈ సినిమా ఈ నెల 24 శుక్రవారం విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ లక్ష్మి రాయ్ హాట్ హాట్ పోస్టర్స్ తో సినిమాకి ఎక్కడలేని పబ్లిసిటీ చేస్తుంది.
అయితే ఈ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఒక హీరోయిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందని టాక్. అప్పట్లో ఖాన్ త్రయం లో స్టార్ లు గా ఉన్న టైం లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తెలుగు లో ఒక వెలుగు వెలిగిన నగ్మా జీవిత చరిత్ర ఆధారంగా ఈ జూలీ 2 తెరకెక్కిందనే టాక్ వినబడుతుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైం లో భోజ్ పురి మూవీస్ ఓకే చేసి ఇటు టాలీవుడ్ కి దూరం అయిపొయింది నగ్మా.
అయితే ఈ జూలీ 2 లో కూడా లక్ష్మి రాయ్ పాత్ర మొదట పెద్ద సినిమాలు చేసి తరువాత భోజ్ పురి సినిమాలు చేస్తుందట. మరి దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పక్కాగా నగ్మా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. చూద్దాం నగ్మా జీవిత కథా.. లేకుంటే ఇంకెవరైనా హీరోయినా అనేది. మరో రెండు మూడు రోజుల్లో తెలిసిపోతుంది.

