Fri Dec 19 2025 20:40:07 GMT+0000 (Coordinated Universal Time)
జూనియర్ అభిమానుల ఆగ్రహాన్ని తప్పించుకున్న డైరెక్టర్

సింగం సీరీస్ తో చితక్కొడుతున్న తమిళ డైరెక్టర్ హరి ఆ మధ్యన ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అసలు హరి ఇప్పటివరకు ఎన్టీఆర్ ని కలవలేదని, మాకు ముఖ పరిచయం కూడా లేదని చెప్పాడని ప్రచారం జరిగింది. అసలు హరి అలా ఎందుకు అన్నాడో తెలియదు గాని ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం డైరెక్టర్ హరి మీద తీవ్ర ఆగ్రహంతో వున్నారు. అయితే ఎన్టీఆర్ ఎవరో తెలియదంటూ వ్యాఖ్యానించిన హరి మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా ఇంతవరకు స్పందించలేదు.
అయితే ఇప్పుడు సూర్య - హరి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ 3 ప్రమోషన్లో భాగంగా అయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ నాకు తెలియకపోవడమేమిటి.... ఆయన నటన నాకెంతో ఇష్టం.... అసలు ఆయన ఎనర్జీ అంటే మరీ ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఇంకా ఎన్టీఆర్ కీ తనకి చాల సంవత్సరాలుగా పరిచయం ఉందని.. అలాటిది నేను ఎన్టీఆర్ అంటే ఎవరో నాకు తెలియదు అని ఎలా చెబుతానని చెబుతున్నాడు. మరి ఆ మాటలనకుండా మీడియా నే తన మాటలను వక్రీకరించిందని హరి చెప్పకనే చెప్పాడు.
Next Story

