జివి ప్రకాష్ తాజా చిత్రం ‘4జి’

సంగీత దర్శకులు కథానాయకులుగా మారటం ప్రస్తుత ట్రెండ్. ఈ ట్రెండ్ కి తెర లేపింది తమిళ తంబీలే. జి.వి.ప్రకాష్, బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంథోనీ లాంటి వారు అటు సంగీత దర్శకులుగా ఇటు కథానాయకులుగా విజయాలు అందుకుంటున్నారు. ఇటీవల దర్శకుడు సుకుమార్ కూడా దేవి శ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తానని ప్రకటించారు. ఈ యువ సంగీత దర్శకులందరిలో బాగా జోరులో వున్నా కథానాయకుడు జి.వి.ప్రకాశే. తమిళంలో డార్లింగ్ చిత్రంతో నట జీవితం ప్రారంభించాడు జి.వి.
తెలుగులో ఘన విజయం సాధించిన ప్రేమ కథా చిత్రాన్ని తమిళంలో డార్లింగ్ పేరుతో తెరకెక్కించగా అందులో ప్రధాన పాత్ర పోషించి ప్రెకషకులకు దగ్గర అయ్యాడు. తరువాత జి.వి నటించిన త్రిష ఇల్లన్న నయనతార కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ విజయాల జోరుతో వరుసగా చిత్రాలలో నటించటానికి సిద్ధం అయిపోయాడు జి.వి. తాజాగా సి.వి.కుమార్ తిరుకుమారం పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటించే అవకాశం సంపాదించాడు. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దగ్గర శిష్యరికం చేసిన వెంకట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి 4G అనే పేరును ఖరారు చేసారు.
జి.వి.ప్రకాష్ నటించిన కడపుల్ ఇరుక్కన్ కుమారు, బ్రూస్ లీ చిత్రాలు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. వచ్చే నెలలో తక్కువ వ్యవధిలోనే ఈ రెండు చిత్రాల విడుదలలు ఉండబోతున్నాయి.

