జాన్వీ నువ్వు కేక

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ తెరంగేట్రం పూర్తయ్యింది. కరణ్ జోహార్ వంటి కింగ్ మేకర్ ద్వారా తెరకు పరిచయమవుతున్న జాన్వీ కపూర్ పూర్తిస్థాయి హీరోయిన్ లక్షణాలతో కనబడడమే కాదు... అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం జాన్వీ చేస్తున్న ‘ధడక్’ సినిమాలో జాన్వీ కపూర్ చాలా పద్దతిగా అందంగా.. తల్లి శ్రీదేవి ని మించిన అందంగా కనబడుతుంది. జాన్వీ కపూర్ ‘ధడక్’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే ఆకట్టుకుంది. ఇకపోతే పార్టీలలో, ఫంక్షన్స్ లలో హీరోయిన్స్ ని తలదన్నే రీతిలో జాన్వీ కపూర్ అదిరిపోయే డ్రెస్సులతో.. అందచందాలతో అందరి మతులు పోగెట్టేస్తూ కుర్ర హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చేలెక్కన తయారైంది.
అయితే ప్రస్తుతం ఫస్ట్ లుక్ ని విడుదల చేసుకున్న ‘ధడక్’ మూవీలోని కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి పదహారేళ్ళ వయసులో శ్రీదేవి ఎంత క్యూట్ గా అమాయకంగా ఉందొ.. అంతే క్యూట్ గా జాన్వీ కపూర్ కనబడుతుంది. కానీ అందులో అమాయకత్వం లేదు. అదే లెవల్లో అందంతో వచ్చిన కాంతి జాన్వీ కపూర్ లో కనబడుతుంది. ఇప్పుడు బయట హల్చల్ చేస్తున్న జాన్వీ కపూర్ పిక్స్ లో కంప్లీట్‌గా తన స్టయిల్ని మార్చేసి ట్రెండ్‌కి అనుగుణంగా మారిపోయిందా అనిపిస్తుంది.
మొదటి సినిమాకే ఈ స్పీడుంటే.. రాబోయే చిత్రాల్లో జాన్వీ కపూర్ ఇంకెలా వుంటుందోనని చర్చించుకుంటున్నారు బాలీవుడ్ లవర్స్. ఇకపోతే జాన్వీ కపూర్ నటిస్తున్న ‘ధడక్’కి 2018 జూలై 6న రిలీజ్ కానుంది.

