చైతూ రెండు ఒకేసారి పూర్తి చేస్తాడట

అక్కినేని నాగ చైతన్య - సమంత ని పెళ్లి చేసుకుని రిసెప్షన్, గెట్ టుగెదర్ పార్టీలంటూ బిజీగా ఉన్నాడు. మరో పక్క సమంత మాత్రం తన సినిమాల షూటింగ్ లకు హాజరవుతుంది. ఇక నాగ చైతన్య పెళ్ళికి ముందు సైన్ చేసిన సినిమా 'సవ్యసాచి'. కాని చైతు - సామ్ ల పెళ్ళికి ముందే మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన సెట్స్ మీదకెళ్ళలేదు. అయితే ఎప్పుడో పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు అంటే నవంబర్ 8 ఉదయం తొమ్మిది గంటలకి స్టార్ట్ అయ్యింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఫస్ట్ షెడ్యూల్ లో మొత్తం యాక్షన్ సీన్స్ పై ఉంటుందని సమాచారం.
'సవ్యసాచి' పేరులోనే బోలెడంత వైవిధ్యాన్ని నింపుకున్న ఈ సినిమా పట్ల అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొని ఉంది. అంతేగాక చైతుతో గతంలో 'ప్రేమమ్' వంటి సూపర్ హిట్ సినిమాని తీసిన చందూ మొండేటి ఈ సినిమాని ని డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ భామ నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పెళ్లి తరువాత అటు సమంతా 'రంగస్థలం 1985' ఇంకా 'మహానటి' సినిమాల తో బిజీ గా ఉంటే నాగ చైతన్య ఇప్పుడు తాజాగా 'సవ్యసాచి' తో బిజీ కాబోతున్నాడు.
ఇక 'సవ్యసాచి' మొదటి షడ్యూల్ పూర్తి కాగానే నాగ చైతన్య, మారుతీ దర్శకత్వంలో ఒక (శైలజ రెడ్డి అల్లుడు) సినిమా ని కూడా పట్టాలెక్కించబోతున్నాడు. అటు 'సవ్యసాచి', ఇటు మారుతి సినిమాని ఏకాలంలో పూర్తి చెయ్యాలని చైతు ప్లాన్.

