చైతూ... ఎన్టీఆర్ కి ఇన్విటేషన్ ఇస్తాడా?

నాగ చైతన్య తన ప్రేమికురాలు సమంత ని వచ్చే నెల అంటే అక్టోబర్ 6 వ తేదీన గోవా లో పెళ్లాడబోతున్నాడు. అయితే ఈ పెళ్ళికి సినిమా ఇండస్ట్రీ నుండి అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరవుతున్నారు. నాగ చైతన్య తనకు అత్యంత ఆప్తులైన వారిని, అతికొద్ది మంది దగ్గర స్నేహితులని మాత్రమే పెళ్ళికి పిలుస్తున్నాడు. అలాగే సమంత కూడా తన తరఫునుండి కొద్దిమందిని మాత్రమే ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ పెళ్ళికి పిలిచే లిస్ట్ దాదపు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి.
ఇక ఆ కొద్దిమందిని కూడా పర్సనల్ గా వెళ్లికాని... లేకపోతె ఫోన్ కాల్స్ ద్వారాగాని తన పెళ్ళికి ఆహ్వానిస్తున్నాడట చైతు. ఇక పెళ్ళికి ఇన్విటేషన్స్ గట్రా ఏం ప్రింట్ చేయించకుండా కేవలం పిలుపులతోనే సరిపెట్టేస్తున్నాడట. ఇక ఈ అత్యంత ఆప్తులు, స్నేహితుల లిస్ట్ లో రానా దగ్గుబాటి ముందున్నాడట. మరి చైతూకు రానా బావ అవుతాడు అలాగే చైతూకి రానా మంచి స్నేహితుడు కూడా. అందుకే రానాని చైతు ఇంటికెళ్ళిమరీ ఆహ్వానించబోతున్నాడట. ఇక రానా తరవాతి చైతు లిస్ట్ లో ఉన్నది ఎన్టీఆర్ అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నాగ చైతన్యకి సినిమా పరిశ్రమకి సంబందించిన మంచి స్నేహితుడనే విషయం చైతు చాలాసార్లు చెప్పాడు,
ఇక ఎన్టీఆర్ ని కూడా నాగ చైతన్య పరసనల్ గా వెళ్లి పెళ్ళికి ఆహ్వానించొచ్చనే టాక్ వినబడుతుంది. ఇక సమంత కి కూడా ఎన్టీఆర్ మంచి స్నేహితుడే. వీరిరువు చాలా సినిమాల్లో నటించారు కూడా. మరి గోవాలో లో జరిగే చైతు - సామ్ ల వెడ్డింగ్ కి ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక నాగ చైతన్యకి ఇండస్ట్రీలో నితిన్, అల్లు శిరీష్ లు కూడా మంచి స్నేహితులే మరి వాళ్ళని కూడా చైతు పెళ్ళికి పిలుస్తాడా లేదో క్లారిటీ లేదు. ఇకపోతే అక్టోబర్ 10 న మాత్రం చైతు-సామ్ ల రిసెప్షన్ ని నాగార్జున హైదరాబాద్ లో అదిరిపోయే లెవల్లో ఆరెంజ్ చేస్తున్నాడనే టాక్ ఉండనే వుంది. ఇక పెళ్ళికి హాజరు కాలేకపోయినా.... అక్కినేని రిసెప్షన్ కి మాత్రం సినిమా పరిశ్రమ తరలివస్తుంది అంటున్నారు.

