చైతు రావడంలేదా..?

నాగ చైతన్య తాజా చిత్రం 'యుద్ధం శరణం' షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రంలో నాగ చైతన్య లుక్ మొదటినుండి ఆకట్టుకుంటూనే వుంది. ఇక ఈచిత్రంలో శ్రీకాంత్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. నాగ చైతన్య మాస్ లుక్ తో రఫ్ గా కనిపిస్తూ అక్కినేని అభిమానులకు అదిరిపోయే ట్రీటిచ్చాడు. అయితే 'యుద్ధం శరణం' చిత్రం విడుదల ఈనెలలోనే ఉంటుందంటూ ప్రచారం జరిగింది. ఆగష్టు నెలాఖరున 'యుద్ధం శరణం' విడుదల ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు 'యుద్ధం శరణం' విడుదల విషయంలో చిత్ర యూనిట్ కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు వార్తలొసున్నాయి.
ముందుగా అనుకున్నట్లు ఆగష్టు 24 న గాని ఆగష్టు 25 న గాని ఈ చిత్రం విడుదల కావడం లేదని.... కారణం బాలకృష్ణ 'పైసా వసూల్' అంటున్నారు. 'యుద్ధం శరణం' నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రానికి ఒక మంచి డేట్ లాక్ చెయ్యడానికి కొంత కన్ఫ్యూషన్తో ఆయన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే 'యుద్ధం శరణం' విడుదలయిన వారానికే బాలకృష్ణ 'పైసా వసూల్' తో థియేటర్స్ లో దిగిపోతాడు. మరి 'పైసా వసూల్' కోసం నాగ చైతన్య సినిమాని థియేటర్స్ నుండి తీసెయ్యాల్సి ఉంటుంది. అది హిట్టయినా లేకున్నా ఫట్టయినా. మరి ఇప్పుడు కాకపోతే సెప్టెంబర్ మిడిల్ లో అయినా విడుదల చేద్దామంటే ఆ తర్వాత వచ్చే 'జై లవ కుశ, స్పైడర్' లతో దెబ్బపడే అవకాశం ఉండడంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో నిర్మాత వున్నాడంటున్నారు.
ఇక ఈ చిత్ర భవిష్యత్తు మాత్రం ప్రస్తుతానికి నిర్మాత సాయి కొర్రపాటి చేతిలోనే ఉందంటున్నారు. ఆయన చెప్పిన టైం కి 'యుద్ధం శరణం' విడుదల చేస్తారా? లేకుంటే వాయిదా వేస్తారా అనేది మాత్రం సాయి గారు క్లారిటీ ఇచ్చేవరకు సస్పెన్స్ అంటున్నారు. మరోపక్క నాగ చైతన్య తన పెళ్లి పనుల్లో బిజీగా వున్నాడు. ఇక ఈసినిమా విడుదల అయితే చైతుకి కాస్త టెన్షన్ తగ్గుతుంది. పెళ్లిపనుల్లో కూడా హ్యాపీ గా పాల్గొనగలడు. ఒక వేళా సినిమా వాయిదా వస్తే మాత్రం చైతు కి కొంచెం ఇబ్బందే అంటున్నారు.

