చైతు ని ప్రమోట్ చేస్తున్న సామ్!!

నాగ చైతన్య - సమంత ఈ అక్టోబర్ 6 వ తేదీన గోవాలో పెళ్లిచేసుకోబోతున్నారు. వీరి పెళ్లి హిందూ, క్రిష్టియన్ సంప్రదాయ పద్ధతుల్లోనే జరగబోతుంది. అయితే సమంత, నాగ చైతన్యలు ఇరువురు ఒకరిపై ప్రేమను మరొకరు పబ్లిక్ గానే వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ వాళ్ళే తమ సినిమాల షూటింగ్ తో బిజిగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదిక వారి ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సమంత 'రంగస్థలం, మహానటి' షూటింగ్స్ మాత్రమే కాకూండా తమిళ సినిమాల్తోనూ బిజీగా ఉండగా నాగ చైతన్య కూడా తన సినిమా 'యుద్ధం శరణం' షూటింగ్ తో బిజీగా వున్నాడు.
ఆర్.వి. కృష్ణ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మాతగా తెరకెక్కిన 'యుద్ధం శరణం' చిత్ర టీజర్ కూడా తాజాగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా 'యుద్ధం శరణం' టీజర్ యూట్యూబ్ లో సంచలనను క్రియేట్ చేస్తుంది. ఇక నాగ చైతన్య తన సినిమా టీజర్ ని పోస్ట్ చేస్తూ.. ‘శత్రువులు ద్రోహం చేసినా. ఆశలు ఆవిరైనా. నా గూడు చెదిరినా... నేను ధైర్యంగా జీవించగలను’ అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే భర్త గారి 'యుద్ధం శరణం' టీజర్ ని తాను కూడా ప్రమోట్ చేస్తే సినిమాకి మరింత క్రేజ్ వస్తుందని భావించిన సమంత సోషల్ మీడియా వేదికగా 'నాహీరో చాలా గ్రేట్' అంటూ ముద్దుగా చైతు ట్వీట్ కి రీట్వీట్ చేసింది.

