చెర్రీ గెటప్ వెనుక వరుణ్‌తేజ్ ఇన్స్పిరేషన్ ఉందా?

ధృవ చిత్రంలో రాంచరణ్ తేజ్ గెటప్ ఇవాళ కొత్తది విడుదల అయింది. ఫ్యాన్స్ కు పిచ్చ క్రేజ్ కలిగించే విధంగా చెర్రీ ఈ స్టిల్ లో అదరగొట్టేలా ఉన్నాడు. అయితే ఈ స్టిల్ ను జాగ్రత్తగా గమనించిన వారికి , ఆ గెటప్ లో మెగా ఫ్యామిలీకే చెందిన మరో హీరో వరుణ్ తేజ్ స్ఫూర్తి ఉన్నట్లుగా కనిపిస్తోందని పలువురు అంటున్నారు.
ఇంతకూ విషయం ఏంటంటే.. వరుణ్ తేజ్ లేట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా వెర్సటాలిటీని మెయింటైన్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.
కంచె వంటి చిత్రం చేయగల అరుదైన హీరోల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కమర్షియల్ సక్సెస్ కోణంలో తనను ప్రేక్షకులు చూడకుండా.. మామూలుగా రిసీవ్ చేసుకునే వాతావరణాన్ని సృష్టించుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలో ఇటీవలి కాలంలో వరుస ఫ్లాప్‌లతో చిరాకెత్తిపోయి ఉన్న రాంచరణ్ ధృవ చిత్రంలో కంచె వరుణ్‌తేజ్ ను పోలిన మీసకట్టు.. అలాంటి లుక్స్ ఉండేలాంటి గెటప్ తో ఉన్నాడని పలువురు అంటున్నారు.
గెటప్ కాపీ అయినా పర్లేదు గానీ.. తమ హీరో.. అసలే చాలా కాలంగా హిట్ ల కోసం మొహం వాచిపోయి ఉన్నాడు.. ధృవ మంచి హిట్ అయితే చాలునని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విష్ దెమ్ ఆల్ ది బెస్ట్

