చెప్పేవేమో శ్రీరంగ నీతులు... చేసేవి మాత్రం

నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీస్ శాఖ ఎంత హెచ్చరించినా మందుబాబులు మాత్రం ఆ మాటను పట్టించుకోకుండానే మద్యం సేవించి పోలీసులకు పట్టుబడ్డారు. ఇలా మద్యం సేవించి పట్టుబడ్డ వారిలో యాంకర్ ప్రదీప్ వ్యవహారం కాస్త సంచలనమే సృష్టించింది. అయితే సినిమాల్లో స్టార్ హీరోలకు ఎంత క్రేజ్ ఉందో.. బుల్లితెర మీద ప్రదీప్ యాంకరింగ్ కి అంతే క్రేజ్ ఉంది. ఎన్ని షోస్ కి యాంకరింగ్ చేసిన... కొంచెం టచ్ లో ఉంటె చెబుతాను అంటూ యాంకరింగ్ తో పాటు ఆ షోకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ప్రదీప్... ఆ షోతో బాగా హైలెట్ అయ్యాడు. అలా ఎంతగా క్రేజ్ సంపాదించాడో.. ప్రదీప్ క్రేజ్ అంతలా పడిపోయేలా మీడియా ప్రదీప్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి యాంకర్ ప్రదీప్ మద్యం సేవించి పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే..
అయితే ఈ విషయాన్నీ మీడియాలో పదే పదే చూపిస్తూ ప్రదీప్ పరువుపోయేలా చేసింది. ఇక మద్యం తగిన కేసులో పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారని తెలుస్తుంది. అయితే ప్రదీప్ తాజాగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి తాగి వాహనాలు నడపకండి, పెద్దవాళ్ళు,యువత మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాగి వాహనాలు నడపకండి.. సీట్ బెల్టులు వాడండి , హెల్మెట్ లు వాడండి. సిగ్నల్ ను ఫాలో అవ్వండి.. అందరి సేఫ్టీ ని పట్టించుకోండి అని సోషల్ మీడియా ద్వారా యువతకు సందేశమిచ్చాడు.
మరి అలా శ్రీరంగ నీతులు చెప్పిన ప్రదీప్ మద్యం తగి డ్రైవ్ చేస్తూ పోలీస్ లకు పట్టుబడే సరికి..... ప్రజలకు నీతులు చెప్పి ప్రదీప్ చేసింది ఏంటో అని ప్రజలు అతడిపై మండిపడుతున్నారు. ఇకపోతే పోలీస్ కౌన్సిలింగ్ లో భాగంగా ఈరోజు ప్రదీప్ పోలీసుల ముందు హాజరయ్యే అవకాశముంది.

