చెన్నైలో జరగబోయే ఈవెంట్లోనే దాన్ని వదిలేస్తారట

మహేష్ 'స్పైడర్' షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఒక పాట మినహా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆపాటను కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తిచెయ్యనుంది. సినిమా విడుదల కూడా దగ్గర పడుతుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు పబ్లిసిటీ కార్యక్రమాలపై కూడా పూర్తి దృష్టి పెట్టింది. రెండు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో లో ఒకేసారి విడుదల చెయ్యడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఎలాగూ మహేష్ కి మంచి మార్కెట్ ఉంది కాబట్టి తమిళంలో కూడా మహేష్ మార్కెట్ పెంచడానికి దర్శక నిర్మాతలు భారీ ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగానే మహేష్ తమిళ ఎంట్రీ ఈవెంట్ భారీగా లాంచ్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చింది లైకా ప్రొడ్యూషన్ సంస్థ. ఆ ఈవెంట్ లో మహేష్ తమిళ పరిచయ కార్యక్రమం గ్రాండ్ గా జరగబోతుంది. అయితే ఈ ఈవెంట్లోనే స్పైడర్ థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నాడు డైరెక్టర్ మురుగదాస్. ఆ ట్రైలర్ ని అందరూ మెచ్చేలా కట్ చేసే పనిలో మురుగదాస్ నిమగ్నమై ఉన్నాడనే టాక్ వినబడుతుంది. స్పైడర్ రెండు టీజర్స్ యూట్యూబ్లో దూసుకుపోతు మంచి హైప్ క్రియేట్ చేసినట్లే ఇప్పుడు స్పైడర్ థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆ లేవల్లోనే జనాలను ఆకర్షించేలా మురుగదాస్ ఈ ట్రైలర్ ని కట్ చేస్తున్నాడట.
ఇక టీజర్స్ లో స్పైడర్ కథ ఎలా ఉంటుందో కూడా చిన్న క్లూ ఇవ్వని మురుగదాస్ ఈ ట్రైలర్ తో ఎమన్నా స్పైడర్ గురించి తెలిసేలా చేస్తాడేమో సెప్టెంబర్ 9 న చెన్నైలో జరగబోయే ఈవెంట్ లో రివీల్ అవుతుందంటున్నారు. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 27 న విడుదల చేస్తుండగా.... ఈచిత్రంలో మొదటిసారి రకుల్ ప్రీత్ సింగ్, మహేష్ సరసననటిస్తుంది.

